'సీతారామం' డ్రీమ్ ర‌న్ కంటిన్యూస్‌

Update: 2022-08-10 11:30 GMT
దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ న‌టించిన క్లాసిక‌ల్ ల‌వ్ స్టోరీ `సీతా రామం`. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ పై భారీ చిత్రాల నిర్మాత సి.అశ్వ‌నీద‌త్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఆగ‌స్టు 5న విడుద‌లైన ఈ మూవీ యునానిమ‌స్ గా క్లాసిక్ హిట్ అనిపించుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద డ్రీమ్ ర‌న్ ని కంటిన్యూ చేస్తోంది. రిలీజ్ రోజుని మించి చాలా ఏరియాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ని సాధిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది.

ఫ‌స్ట్ డే, సెకండ్ డేల‌తో పోలిస్తే మంగ‌ళ‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా పుంజు కోవ‌డం విశేషం.  అద్భుత‌మైన క‌థ‌, అంత‌కు మించిన విజువ‌ల్స్‌తో ద‌ర్శ‌కుడు సినిమాని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు గ్లోబ‌ల్ ఆడియ‌న్స్ ని మంత్ర ముగ్థుల్ని చేస్తోంది. దీంతో వర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మ‌న‌సుని హ‌త్తుకునే ఎపిక్ ల‌వ్ స్టోరీ, మ‌ధ్య‌లో ఎమోష‌న‌ల్ వార్ డ్రామా.. ప్రేక్ష‌కుల‌కు యునిక్ ల‌వ్ స్టోరీని చూసిన అనుభూతిని క‌లిగిస్తోంది.

ప్రేమ‌క‌థ‌ల్లో స‌రికొత్త ట్రెండ్ సెట్ట‌ర్ గా ట్రేడ్ వ‌ర్గాలు, విమర్శ‌కులు అభివ‌ర్ణిస్తున్న `సీతా రామం`వ‌సూళ్ల ప‌రంగానూ స‌రికొత్త రికార్డుల దిశ‌గా ప‌య‌నిస్తోంది. క్రిటిక్స్‌, సెల‌బ్రిటీస్‌, కామ‌న్ ఆడియ‌న్స్ ఈ మూవీకి ఫిదా అయిపోతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి ఎపిక్ ల‌వ్ స్టోరీని చూడాలేదంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ ల కెమిస్ట్రీ, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్‌, హ‌ను రాఘ‌వ‌పూడి టేకింగ్, పీఎస్ వినోద్ స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌, వైజ‌యంతీ, స్వ‌ప్న సినిమా ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ వెర‌సి ఈ మూవీని క్లాసిక్ గా నిల‌బెట్టాయి.

మొద‌టి రోజు వ‌సూళ్లుకొంత త‌క్కువ‌గానే క‌నిపించినా ఆ త‌రువాత క్ర‌మ క్ర‌మంగా మౌత్ టాక్ తో పెర‌గ‌డం మొద‌లైంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ మంగ‌ళ‌వారం వ‌సూళ్లు మ‌రింత‌గా పెరిగాయ‌ని తెలిసింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని చాలా సెంట‌ర్ల‌లో ఈ మూవీ హౌస్ ఫుల్స్ తో ర‌న్న‌వుతూ మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. అంత‌లా పాజిటివ్ టాక్‌, క్లాసిక్ హిట్ అని వినిపిస‌తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరిగుతోంది. దీంతో వ‌సూళ్లు మ‌రింత‌గా పెరుగుతున్నాయి.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ కేవ‌లం 5 రోజుల‌కు గానూ రూ. 33 కోట్ల గ్రాస్ ని రాబ‌ట్ట‌డం విశేషం. యుఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద మంగ‌ళ‌వారం ఈ మూవీ ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన‌ట్టుగా మేక‌ర్స్ చెబుతున్నారు. మంగ‌ళ‌వారం ఒక్క రోజే ఈ మూవీ 90కె వ‌సూలు చేసిన‌ట్టుగా తెలిసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 750కె వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిందని, ఈ వారాంతంలోనే వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేర‌డం కాయం అని తెలుస్తోంది.

ఓవ‌రాల్ గా చూస్తూ విడుద‌లైన రోజు నుంచి క్ర మ క్ర‌మంగా మౌత్ టాక్ తో వ‌సూళ్లు పెరుగుతూ పోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న డ్రీమ్ ర‌న్ ని కంటిన్యూ చేస్తుండ‌టం విశేషం అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News