సితార‌-ఆద్య చానెల్లో ఒక బంగాళ‌ దుంప క‌థ‌!

Update: 2021-05-30 10:59 GMT
సోష‌ల్ మీడియాల్లో సితార ఘ‌ట్ట‌మ‌నేని - ఆద్య పైడిప‌ల్లికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రు చిన్నారులు ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర ప్రాజెక్ట్ తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్నారు.
సెసేమ్ వర్క్ షాప్ - తెలుగు యూట్యూబ్ ఛానల్ తన మొదటి ఒరిజినల్ సిరీస్ `టాకింగ్ ఎబౌట్ టాకింగ్స్` తో ముందుకు వచ్చింది. లాభాపేక్ష లేని పిల్ల‌ల వ‌ర్క్ షాప్ కి సంబంధించిన అమెరిక‌న్ చానెల్ కి భార‌తీయ విభాగ‌మిది. ఈ కిడ్స్ చానెల్ ని సితార‌-ఆద్య ర‌న్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఎల్మో- చామ్కి .. కుకీ మాన్ స్ట‌ర్ - ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన ముప్పెట్ పాత్రలతో బొచ్చు - ఫన్నీ పాత్రలతో ఈ చిన్నారులు సరదాగా కనిపిస్తారు. తొలిగా సితార‌-ఆద్య జోడీ బంగాళ‌దుంప పై ఫ‌న్ క్రియేట్ చేస్తూ టీచ‌ర్లు గా మారిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

సిరీస్ మొదటి ఎపిసోడ్ లో టాకింగ్ ఎబౌట్.. టాకింగ్ విత్ ఎల్మో ఆస‌క్తిని క‌లిగించాయి. సితార‌- ఆద్య ఇప్పటికే సోషల్ మీడియా సూపర్ స్టార్స్. యూట్యూబ్ ఛానల్ తో వివిధ సోషల్ మీడియా ఖాతాలతో బలమైన ఉనికిని మంచి ఆద‌ర‌ణ‌ను కలిగి ఉన్నారు. వారి యూట్యూబ్ ఛానల్ `ఎ అండ్ ఎస్ ఛానల్`లో ఇప్పటికే 245 కే చందాదారులు ఉన్నారు. ఫేస్ బుక్ - ఇన్ స్టాగ్రామ్ లో వారికి భారీ ఫాలోయింగ్ ఉంది. సితార 388 కే ఫాలోవర్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఒక పెద్ద‌ స్టార్. సెసేమ్ వర్క్ షాప్ చానెల్- తమ ప్రజాదరణను ఉపయోగించి తెలుగు పిల్లలతో సన్నిహితమ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సితార‌-ఆద్య ప్ర‌మోష‌న్ దీనికి పెద్ద అస్సెట్ కానుంది.


Full View
Tags:    

Similar News