కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ స్టార్ శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో నానికి ఏ రేంజ్ ఇమేజ్ ఉందో, తమిళంలో శివ కార్తికేయన్ కి కూడా అదే రేంజ్ ఇమేజ్ ఉంది. తాజాగా ఈ యంగ్ హీరో ప్రిన్స్ మూవీతో తెలుగులోకి కూడా అడుగుపెట్టాడు. అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది.
జాతిరత్నాలు ఫ్లేవర్ లోనే వన్ లైన్ ఆర్డర్ డైలాగ్స్ తో ప్రిన్స్ మూవీలో కామెడీ పండించే ప్రయత్నం దర్శకుడు అనుదీప్ చేశాడు. ప్రిన్స్ కూడా ఆ పాత్రలో ఇమిడిపోయి తనదైన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసాడు. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. దీంతో రెండు భాషలలో కూడా ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే విజేగా కెరియర్ స్టార్ట్ చేసిన శివ కార్తికేయన్ 2012లో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేశాడు.
ఏకంగా 10 ఏళ్ళలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేయడానికి ముందే 2010లో పెళ్లి చేసుకున్నాడు. ఇక తాను హీరో అయ్యే సమయానికి ఒక కూతురు కూడా పుట్టింది. ఇక 2021లో శివకార్తికేయన్ కి కొడుకు పుట్టాడు. 18 ఏళ్ళ తర్వాత తన తండ్రి మళ్ళీ తన జీవితంలోకి వచ్చాడు అంటూ ఆ టైంలో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
కొడుకుకి గగన్ దాస్ అనే పేరు పెట్టారు. తాజాగా పొంగల్ సందర్భంగా శివ కార్తికేయన్ తన కొడుకుని పరిచయం చేస్తూ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రతి ఏడాది పొంగల్ ని శివకార్తికేయన్ సొంత ఊరిలో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు. అలాగే ఈ సారి కూడా సొంతూరు వెళ్లి పొంగల్ ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసుకొని అభిమానులు అందరికి విషెస్ చెప్పాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.