సోలో హీరోగా తమిళనాట తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శివ కార్తికేయన్. కీర్తీ సురేష్ తో జంటగా నటించిన ‘రెమో’ చిత్రం గతవారం విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకుంది. త్వరలో తెలుగులో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి, రెమో ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుంచి మాంచి క్రేజును సొంతం చేసుకుంది. ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో సంచలనమైంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ లేడీ గెటప్ లో వెరైటీగా నటించాడు. ఆ సీన్లన్నీ బాగానే పండాయి. మొత్తానికి తమిళనాట మంచి కలెక్షన్లనే రాబడుతున్నాడు రెమో. ఈ విజయం నేపథ్యంలో చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్లో థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో హీరో శివ కార్తికేయన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు!
తన రెమో సినిమాను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారని షాకింగ్ న్యూస్ చెప్పాడు. దీంతో కార్యక్రమానికి వచ్చినవారంతా కాసేపు మౌనంగా అతడివైపే చూస్తూ ఉండిపోయారు. ఈ సినిమాను అడ్డుకునేందుకు ఎవరు ప్రయత్నించారో తనకు తెలుసుననీ, అయినా తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాననీ, తన కెరీర్ బాధలేవో తాను పడుతున్నాననీ, అయినా సరే ఇలా ఎందుకు జరుగుతోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ, ఈ సినిమాను ఆపాల్సినంత కారణాలు ఏమున్నాయి..? శివ కార్తికేయన్ లాంటి యువ హీరో చిత్రాలను అంతగా కక్షకట్టి అడ్డుకునేందుకు ఎవరు ప్రయత్నించారు..? పోనీ, ఈ చిత్ర కథాంశం కూడా ఏమంత వివాదాస్పదమైందీ కాదు, ఫక్తు కమర్షియల్ సినిమా కదా! ఇప్పుడు తమిళ చిత్ర వర్గాల్లో శివ కార్తికేయన్ వ్యాఖ్యలు చర్చనీయంగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలుగులో కూడా రెమో రాబోతున్నాడు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ఏమాత్రం ఆదరణకు నోచుకుంటుందో వేచి చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/