తమిళ స్టార్ హీరోల సినిమాల విషయంలో ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న కర్ణన్ చిత్రంపై వివాదం రాజుకుంటుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ లో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఒక వర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది అంటూ ఇప్పటికే వారు ఆందోళన చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ చిత్రం టైటిల్ విషయమై శివాజీ గణేశన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక 1999లో జరిగిన కొడియాంగుళం మణిమచ్చి జాతి ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని.. పులిప్పడై సామాజిక వర్గంను ఈ చిత్రం లో తప్పుగా చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాలోని ఒక సీన్ లో పోలీస్ స్టేషన్ ను ధనుష్ కాల్చి వేసే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో తమను టార్గెట్ చేశారనే ఆరోపణలు పులిప్పడై సామాజిక వర్గం వారు చేస్తున్నారు.
తాజాగా పులిప్పడై సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియా లో వీడియోను పోస్ట్ చేశాడు. అందులో తమ సామాజిక వర్గం గురించి ఎలాంటి తప్పుడు సీన్స్ ఉన్నా కూడా తల నరికేస్తామంటూ హెచ్చరించాడు. మాతో పెట్టుకుంటే మస్సి అవ్వడం ఖాయం అని మీ సినిమాను అడ్డుకుంటామంటూ ఆ కుర్రాడు వీడియోలు ధనుష్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.