సౌత్ సినిమా కొత్త ఫేజ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి - కేజీఎఫ్ సంచలన విజయాలు అందుకోవడంతో ఆ తర్వాత మన దర్శకనిర్మాతలు క్రియేటివ్ సైడ్ ఆలోచిస్తున్నారు. భారీ కాన్వాసుతో పాన్ ఇండియా చిత్రాల్ని తెరకెక్కించే సాహసం చేస్తున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫిక్షన్ లో మరో లెవల్ ని టచ్ చేయాలంటే ఏదో ఒక కొత్తదనం ఉన్న కథని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు శంకర్ 2.0 లాంటి ప్రయోగం చేశాడు. అయితే కాస్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేయలేకపోయాడు. అందులో రోబోటిక్ టెక్నాలజీని అత్యద్భుతంగా ఉపయోగించుకున్నారు. కథ పరంగా.. వీఎఫ్ ఎక్స్ పరంగానూ మిరాకిల్స్ చేశాడు శంకర్.
అయితే అంతకంటే డిఫరెంట్ గా ఏవైనా సినిమాలు సౌత్ లో తెరకెక్కాయా? అంటే జాంబీ మూవీ తరహాలో అప్పట్లో జయం రవి ట్రై చేశాడు. అతడే అంతరిక్షం బ్యాక్ డ్రాప్ మూవీలోనూ నటించాడు. కానీ అవేవీ మెప్పించలేదు. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఇప్పుడు శివకార్తికేయన్ ఏకంగా ఏలియన్ నేపథ్యంలోని కథను ఎంచుకుని సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకి డాక్టర్ (తమిళంలో అలయాన్) అనే టైటిల్ ని నిర్ణయించారు. డాక్టర్ నుండి శివకార్తికేయన్ ఫస్ట్ లుక్ ఇంతకుముందు విడుదలైంది. టైటిల్ పాత్రలో లుక్ ఆశ్చర్యపరిచింది. అతడు వైద్యుడిగా కనిపిస్తున్నా.. అంతకుమించి ల్యాబ్ లో ప్రయోగాలు చేసేవాడిగానూ ఇందులో కనిపించబోతున్నాడని తాజాగా రివీలైన కొత్త పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ లో శివకార్తికేయన్ లాలిపాప్ పట్టుకుని కనిపిస్తున్నాడు. అతడి పక్కనే ఏలియన్ ఫ్రెండ్ కూడా సేమ్ ఫోజిచ్చింది. అంతరిక్షం నుంచి దిగొచ్చే ఏలియన్ తో భూమ్మీద మానవుడు స్నేహితుడు అయితే కథను రక్తి కట్టించవచ్చు. అయితే ఇంతకుముందు బాలీవుడ్ లో హృతిక్ నటించిన కోయీ మిల్ గయా ఏలియన్ బ్యాక్ డ్రాప్ సినిమానే. అందుకే ఇప్పుడు ఎవరూ చూపించనంత కొత్తగా చూపిస్తేనే ఇలాంటి ప్రయోగాలు సక్సెసవుతాయి. ఇది అన్ని భాషల్లో రిలీజయ్యే పాన్ ఇండియా ప్రయత్నం కాబట్టి శివకార్తికేయన్ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ చిత్రంలో యాక్షన్ - థ్రిల్లర్ .. కామెడీ అంశాలు రక్తి కట్టిస్తాయని కార్తికేయన్ చెబుతున్నాడు. `కోకో కోకిల` (నయన్) ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ప్రయోగాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో గ్యాంగ్ లీడర్-ఫేమ్ ప్రియాంక మోహన్ మహిళా డాక్టర్ గా నటిస్తోంది. యోగి బాబు- ఇలావరసు- అర్చన- వినయ్ తదితరులు నటిస్తున్నారు.
ఇక శివకార్తికేయన్ ఇటీవలే `హీరో` సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ అయ్యాడు. ఇదే హుషారులో వరుసగా ప్రయోగాలు చేస్తున్నాడు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ లో నెంజముండు నెర్మయుండు ఒడు రాజా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టెలివిజన్ యాంకర్ రియో రాజ్ ప్రధాన పాత్రలో కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది.