కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 31న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు కన్నడ సినీరంగ ప్రముఖులతో పాటు ఇరుగు పొరుగు భాషల నుంచి పలువురు స్టార్లు వెళ్లారు. బాధాతృప్త హృదయంతో పునీత్ కి నివాళులు అర్పించారు.
ఈరోజు శివ రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పునీత్ మృతిపై మాట్లాడారు. ``నేను పునీత్ సోదరుడిని కావచ్చు. కానీ నేను ఎప్పుడూ అతనిని నా కొడుకు అని చెబుతాను. ఇంత చిన్న వయసులోనే అతన్ని కోల్పోవడం నన్ను చాలా బాధిస్తోంది. నా ప్రియమైన అప్పు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను`` అంటూ శివ రాజ్ కుమార్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
బాల నటుడిగా తెరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా రెండు దశాబ్ధాల కెరీర్ లో దాదాపు 30 సినిమాల్లో నటించారు. కన్నడ నాట అప్పుగా సుప్రసిద్ధుడై ఇప్పుడు నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. అతడి నటన ఆహార్యం డ్యాన్సులు ఫైట్స్ కి మాస్ ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ లా అతడు వేసే ఎనర్జిటిక్ స్టెప్పులకు అభిమానులున్నారు. అలాంటి ప్రతిభావంతుడు కేవలం 46 వయసులోనే అంతర్ధానం కావడం జీర్ణించుకోలేనిది. రాజ్ కుమార్ కుటుంబం కోలుకోలేని దెబ్బ ఇది.