ఎస్.జె.సూర్య.. అటు తమిళ ప్రేక్షకులకు.. ఇటు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తమిళంలో అజిత్.. విజయ్.. తెలుగులో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన దర్శకుడతను. ఇప్పుడు నటుడిగా కూడా మహేష్.. విజయ్ లాంటి సూపర్ స్టార్ల సినిమాల్లో నటించాడు. మహేష్ లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’లో సూర్య నటనకు ఎంత మంచి పేరొచ్చిందో తెలిసిందే. ఇప్పుడు సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ ఆర్టిస్టుల్లో అతనొకడు. ఇప్పుడీ స్థాయిలో ఉన్న ఎస్.జె.సూర్య ఒకప్పుడు హోటల్లో సర్వర్ గా పని చేస్తూ ప్లేట్లు కడిగేవాడట. కడుపు నింపుకోవడం కోసం తాను ఇంకా చాలా పనులే చేసినట్లు అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తన కుటుంబంలో అందరూ చాలా బాగా చదువుకుని.. లెక్చరర్లుగా.. ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారని.. ఐతే తనకు మాత్రం చిన్నప్పట్నుంచి సినిమాలపై ఆసక్తితో సినీ రంగానికి వచ్చేసినట్లు చెప్పాడు సూర్య. శివాజీ గణేషన్ ను కలిసి తన గురించి చెబితే నటుడిగా అవకాశం ఇస్తారనుకుని పల్లెటూరి నుంచి చెన్నైకి వచ్చానని.. కానీ ఇక్కడికొచ్చాకే సినిమాల్లో అవకాశం ఎంత కష్టమో అర్థమైందని అన్నాడు సూర్య. జూనియర్ ఆర్టిస్టుగా అవకాశం లభించినా.. నెలలో నాలుగు రోజులకు మించి పని ఉండేది కాదని.. అలాంటి పరిస్థితుల్లో తాను హోటల్లో సర్వర్ గా పని చేసినట్లు సూర్య వెల్లడించాడు. అలా పని చేసుకుంటూ సినిమాల్లోనూ ప్రయత్నాలు చేశానని.. ఓ సినిమాకు చాలా కష్టపడి పని చేయడం చూసిన అజిత్.. తనకు అవకాశం ఇవ్వాలనుకున్నారని.. నాలుగేళ్ల తర్వాత ఆయన పిలిచి అవకాశమిస్తే ‘వాలి’ కథ వినిపించానని సూర్య చెప్పాడు. ఆ సినిమాను అనేక ఇబ్బందుల మధ్య చేశామని.. అది బ్లాక్ బస్టర్ కావడంతో తన జీవితం మలుపు తిరిగిందని.. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది అజిత్ పెట్టిన భిక్షే అని సూర్య చెప్పాడు.