ఏలూరులో థియేటర్ పక్కేనే ఇల్లు ఉంటే చాలా ప్రమాదం! ఎందుకంటే రోజూ థియేటర్ లోంచి వినిపించే శబ్ధాలు చెవుల్ని గుయ్ మనిపిస్తాయ్! ఆ తర్వాత ఆ సినిమాల ప్రభావం వ్యక్తిగత జీవితాల్ని అంతే ప్రభావితం చేస్తుంది. సినిమా పిచ్చి పట్టి చివరికి ఏదైనా అవ్వొచ్చు. కొందరు సినిమా పిచ్చిని తెలివిగా ఎదిగేందుకు ఉపయోగించుకుంటే - మరికొందరి విషయంలో బొమ్మ బొరు సై జీవితాల్ని నాశనం చేసుకునేందుకు దారి తీయొచ్చు. అయితే అదే సినిమా పిచ్చి.. మెగాభిమానం ఒక కుర్రాడిని మాత్రం ఏకంగా సినీ నిర్మాతనే చేసింది. ప్రస్తుతం `ట్యాక్సీవాలా` చిత్రాన్ని నిర్మించిన మెగా ఫ్యాన్ ఎస్.కె.ఎన్ కథే ఇది. ఆయన కథ చాలా ఇంట్రెస్టింగ్.. తెలుసుకున్నవాళ్లకు తెలుసుకున్నంత.
ఎస్.కె.ఎన్ నిర్మించిన `ట్యాక్సీవాలా` ట్రైలర్ ఈవెంట్ కి ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేసి ట్రైలర్ ని లాంచ్ చేశారు. అంతేకాదు.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన ఎస్.కె.ఎన్ ని అభినందించారు. ఈ వేదికపై నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ఎంతో ఎమోషన్ అయ్యారు. ఈ స్టేజ్ పై నేను నిర్మాతగా ఉండటానికి కారణం అల్లు అరవింద్ గారు. చిరంజీవిగారు కారణమని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమాలకు ఏలూరులో బ్యానర్స్ కట్టేవాడిని. అభిమానులంటే కేవలం జెండాలు మాత్రమే కట్టరు. ఆ జెండాల్లో వారి పేరు కూడా ఉండేలా చేయాలని ప్రపంచంలో ఏ నిర్మాతా అనుకోడు. వాళ్ల కుటుంబంలో వ్యక్తినే నిర్మాతగా చేస్తారే కానీ.. మన ఫ్యాన్. టాలెంట్ ఉందని చెప్పి నిర్మాతను చేశారు అల్లు అరవింద్. ఆయన మాత్రమే అలాంటి అవకాశం ఇవ్వగలరు. అవకాశం దక్కడం ఎంత కష్టమో నాకు తెలుసు. బన్నివాసు అయినా.. నేనైనా ఇండస్ట్రీకి వచ్చి పది పదిహేనేళ్ల పాటు మా టాలెంట్ ను నిరూపించుకున్నాం. మమ్మల్ని అరవింద్ గారు నిర్మాతల్ని చేశారు.. అని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఎస్.కె.ఎన్.
`సాహో` నిర్మాత వంశీ నన్ను పిలిచి మంచి కథ తెచ్చుకో నిర్మాతగా సినిమా చెయ్ అని ప్రోత్సహించారు. ఆ విషయాన్ని నేను మారుతికి చెబితే ఆయన రాహుల్ చెప్పిన పాయింట్ ను డెవలప్ చేసుకోమన్నారు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. సూపర్ నేచురల్ సైంటిఫిక్ థ్రిల్లర్. యూనిక్ పాయింట్ తో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేశాం. ప్రతి సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన హీరో ఆయన. వందకోట్ల క్లబ్ హీరోగా ఎదిగారు. మాపై నమ్మకంతో ఆయన ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఫుటేజ్ లీక్ అయ్యింది కదా.. అనే భయం లేదు. ఎందుకంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంది. నవంబర్ 17 సినిమా అందరినీ అలరిస్తుంది. అలాగే నా హీరో బన్ని గురించి చెప్పుకోవాలి. అందరికీ జీవితం `ఎ` తో స్టార్ట్ అయితే నాకు ``ఎఎ``తో స్టార్ట్ అయ్యింది. జీతం తీసుకున్నవాళ్ల గురించి చెప్పకపోయినా పరావాలేదు.. జీవితం ఇచ్చిన వాళ్ల గురించి చెప్పి తీరాలి. బన్ని నన్ను పి.ఆర్.ఒ ని చేశారు. తనతో పాటు తన వాళ్లు కూడా ఎదగాలని భావించే వ్యక్తి అతడు. ఆయననొక లీడర్. మా ఎదుగుదలకు ఇన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న తనకు కృతజ్ఞతలు అన్నారు.