సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇప్పుడు. ఏ చిన్న లూప్ హోల్ దొరికినా.. దాన్ని వివాదంగా మార్చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక జనాలు మరీ సున్నితంగా తయారైపోయి.. కొన్ని అనవసర విషయాలనూ కూడా కాంట్రవర్శీలుగా చేస్తున్నారు. ఐతే అన్నింటికీ జనాల్నే తప్పుబట్టాల్సిన పని లేదు. జనాల మీద వ్యతిరేక ప్రభావం చూపించే విషయాల్లో ఫిలిం మేకర్లు కొంచెం బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది.
తాజాగా విజయ్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘సర్కార్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో ప్రభుత్వ శాఖ నుంచి నోటీసులు కూడా అందుకుంది చిత్ర బృందం. తమిళనాడు హైకోర్టు కూడా జోక్యం చేసుకోవడంతో ఈ పోస్టర్లను వెంటనే తొలగించాల్సి వచ్చింది. ఐతే అంతటితో వివాదం సద్దుమణగలేదు. ధూమపానాన్ని ప్రోత్సహించేలా ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేసినందుకు చిత్ర బృందంపై ఒక కేసు ఫైల్ అయింది. ఈ తప్పు చేసినందుకు రూ.10 కోట్ల జరిమానా కట్టాలని కోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం.
వీళ్లు కట్టే పది కోట్ల రూపాయల్ని చెన్నైలోని క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు విరాళం ఇస్తారట. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని.. దాని వల్ల క్యాన్సర్ వస్తుందని.. సినిమాల వల్లే యువత పెడదోవ పట్టి సిగరెట్లు తాగుతున్నారని.. ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్నారని.. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నందుకు జరిమానా కట్టాల్సిందే అని పిటిషన్లో పేర్కొన్నారు. మరి ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుందో.. నిజంగానో మురుగదాస్ చిత్ర టీం డబ్బులు కడుతుందేమో చూద్దాం.