హీరోయిన్‌ స్నేహకు బాబు పుట్టాడోచ్‌

Update: 2015-08-11 05:02 GMT
మొన్ననే సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో సూపర్‌ మచ్చి అంటూ డ్యాన్సు వేసిన సూపర్‌ హోమ్ లీ హీరోయిన్‌ స్నేహ ప్రెగ్నెంట్‌ అనే సంగతి తెలిసిందే. అయితే అమ్మడు గత రాత్రి ఓ పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. ఈరోజు ఉదయం స్నేహకు బాబు పుట్టినట్టు ఆమె పతి హీరో ప్రసన్నా తెలియజేశాడు. ఇద్దరూ చాన్నాళ్ళుగా ప్రేమించుకుని 2012లో పెళ్ళిచేసుకున్నారు. అయితే అప్పటి నుండి అదిగో స్నేహ ప్రెగ్రెంట్‌ ఇదిగో స్నేహ ప్రెగ్నెంట్‌ అంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ మధ్యనే వాటిని ధృవీకరించాడు ప్రసన్న. కాని ప్రెగ్నెన్సీ తో ఉన్నా కూడా అమ్మడు బన్నీ-త్రివిక్రమ్‌ మూవీలో ఉపేంద్ర సరసన రోల్‌ చేయడానికి ఒప్పుకుందంటే గ్రేట్‌. ఇకపోతే 3 ఏళ్ళ లవ్ లీ హనీమూన్‌ ఎంజాయ్‌ చేశాక ఇప్పుడు మథర్‌ గా కొత్త రోల్‌ ను మొదలెడుతున్న స్నేహకు, ఆమె భర్త ప్రసన్నకు కంగ్రాట్యులేషన్స్
Tags:    

Similar News