హీరోయిన్స్ అందరిలో వరలక్ష్మి శరత్ కుమార్ చాలా విభిన్నమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కమర్షియల్ గా స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు ఏమాత్రం వెనుకాడని ధైర్యవంతురాలు. ఇలాంటి స్వభావం.. దుడుకుతనం ఏ హీరోయిన్ లో కూడా మనం చూడలేం. ఏ పాత్ర ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని చేయగల సత్తా ఉందని నిరూపించుకున్న హీరోయిన్ వరలక్ష్మి.
ఈ అమ్మడు ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న తెలుగు సినిమా ‘నాంది’లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆ సినిమాలోని తన లుక్ ను బ్లాక్ అండ్ వైట్ లో రివీల్ చేసింది. వరలక్ష్మి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో చీర కట్టుకుని ఉండి సిగ్గు పడుతూ త కిందకు దించుకుని ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటో అయినా కూడా వరలక్ష్మి చూడ్డానికి చాలా అందంగా ఉంది. గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో కాస్త చిక్కినట్లుగా కూడా అనిపిస్తుంది. సిగ్గు పడుతూ ఉన్న ఫొటోను పోస్ట్ చేసి అప్పట్లో నేను ఇలా సిగ్గు పడుతూ ఉండేదాన్ని అంటూ పోస్ట్ పెట్టింది.
వరలక్ష్మి పోస్ట్ కు హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న సరదాగా స్పందించాడు. నీకు సిగ్గు కూడా ఉందా అంటూ ఫన్నీగా ప్రశ్నించాడు. ప్రసన్న సరదా కామెంట్ కు స్పందించిన వరలక్ష్మి అందుకే కదా అప్పట్లో అని మెన్షన్ చేశాను అంది. అంటే ఇప్పుడు వరలక్ష్మికి సిగ్గు మొహమాటం లేవని ఒప్పుకున్నట్లేనా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయిలకు సిగ్గు అనేది అందం. ఫొటోలో సిగ్గుపడుతూ ఎంతో బాగున్నావు. అలాగే రియల్ లైఫ్ లో కూడా సిగ్గు పడటం చాలా అవసరం.. అందంగా ఉండాలంటే సిగ్గు పడాలంటూ వరలక్ష్మికి నెటిజన్స్ సలహా ఇస్తున్నారు.