మరో హీరోయిన్ మొగుడు విలన్ గా..

Update: 2017-04-15 11:38 GMT
హీరోయిన్ స్నేహను మన తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవాలిసిన పని లేదు. అనుకువగా ఉన్న పాత్రలు కొట్టినపిండిగా చేస్తుంది. తెలుగులో చాలామంది స్టార్లతో నటించింది. శ్రీరామదాసు వంటి డివోషనల్ సినిమా అయినా.. సన్ అఫ్ సత్యమూర్తి సినిమా లో చిన్న పాత్ర అయన.. స్నేహ బాగా ఇంప్రెస్ చేసింది. అయితే తన స్టార్డమ్ తో ఇప్పుడు మొగుడు ప్రసన్నకు ఇక్కడ బ్రేక్ తెప్పించగలదా?

స్నేహ భర్త ప్రసన్న తమిళ్ లో మంచి పేరున్న నటుడే. ఈ మధ్య ధనుష్ డైరెక్ట్ చేసిన పవర్ పాండి సినిమా లో కూడా నటించాడు. కాకపోతే ఇప్పుడు ఇతను తెలుగులో విలన్ గా చేయబోతున్నారు.  సాయి ధర్మ తేజ్ కొత్త చిత్రంలో ప్రసన్న ఒక నెగటివ్ రోల్ కు కాస్ట్ చేబోతున్నారు అని తెలుస్తుంది. కొద్ది రోజులు కిందట మొదలైన తేజు కొత్త సినిమా ‘జవాన్’లో ప్రసన్న ఈ ఫీట్ చేస్తాడని తెలుస్తోంది. రైటర్ బివిఎస్ రవి రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రసన్న విలన్ అనే విషయాన్ని ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచుతున్నారులే.

ఇంకొక విషయం ఏంటంటే.. ప్రసన్నకు  జోడిగా  స్నేహను అనుకున్నారు కానీ అది  కుదరలేదు. ప్రసన్నకి ఇది మంచి అవకాశం తెలుగులో తన మార్కెట్ ను స్పేస్ ని ఏర్పచు కోవడానికి అని స్నేహ భావిస్తుంది. ఇకపోతే మొన్ననే ఖైదీ నెం 150.. కాటమరాయుడు సినిమాల్లో అంజలా జవేరి మొగుడు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News