స్నేహ కొత్తవతారం క్లిక్కయితేనే...

Update: 2015-04-07 17:30 GMT
అప్పట్లో వరుసగా మాంచి హిట్టు సినిమాల్లో నటించింది హీరోయిన్‌ స్నేహ. తమిళనాట సెటిల్‌ అయిన ఈ తెలుగమ్మాయి, హోమ్లీ హీరోయిన్‌గా ఒక ఆటాడించేసింది. అయితేనేం.. వయస్సు పెరిగింది, పెళ్లయ్యింది, ఇక హీరోయిన్‌ వేషాలు కష్టమే. ఆ మధ్య ఏవైనా అరుంధతి, అనసూయ వంటి పాత్రలేమైనా దొరక్కపోవా అనుకుంది కాని.. అవేం దొరకలేదు. కట్‌ చేస్తే ఇప్పుడు సన్నాఫ్‌ సత్యమూర్తితో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయిపోయింది.

నిజానికి కీలకమైన క్యారెక్టర్స్‌ స్నేహ వంటి హీరోయిన్స్‌ చేస్తే బాగానే ఉంటుంది. అసలే ఇప్పుడు సీనియర్‌ హీరోయిన్లు అందరూ ఏదో ఒక టివి షో తోనో, లేకపోతే రియాల్టీ షో లో జడ్జీలగానో బిజీ అవుతున్నారు. ఈ సందర్భంలో స్నేహ ఎటుకాని వయస్కురాలు అయిపోవడం వలన అలాంటి ఛాన్సులు రావట్లేదు. అటు పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసి పిల్లా పాపలతో కాలం గడిపి తిరిగొస్తున్న కమ్‌బ్యాక్‌ హీరోయిన్‌ కాదు, ఇటు అలాగని హీరోయిన్‌ పాత్రలకు సెటయ్యే ఫ్రెష్‌ ఫేసూ కాదు. అందుకే ఇప్పుడు సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా ఈమెకు అత్యంత కీలకం. ఈ కొత్తవతారం క్లిక్కయితేనే అమ్మడుకి ఇక్కడ కొత్త ఛాన్సులు వచ్చేది.
Tags:    

Similar News