పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తల్లి అయ్యి వారి ఆలన పాలన చూస్తూ జీవితాన్ని సాగిస్తున్న మాజీ మిస్ యూనివర్శిస్ సుష్మిత సేన్ లేటు వయసులో కశ్మీరి మోడల్ రోహ్మాన్ షాల్ తో ప్రేమలో పడ్డ విషయం తెల్సిందే. ఇద్దరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది. తన కంటే రోహ్మాన్ చిన్నవాడు అయినా కూడా తనను ఎంతో అర్థం చేసుకుంటాడని.. తన పిల్లలకు కూడా ఒక మంచి తండ్రిగా అతడు ఉంటాడనే నమ్మకంను పలు సందర్బాల్లో సుష్మిత వ్యక్తం చేసింది. అతడి బర్త్ డే సందర్బంగా సుష్మిత చేసిన పోస్ట్ ఇద్దరి మద్య ఇంత దృడమైన ప్రేమ బంధం ఉందా అంటూ ముక్కున వేలేసుకున్నారు.
ఇద్దరి వ్యవహారంలో ఏం జరిగిందో ఏమో కాని బ్రేకప్ అయ్యారు అంటూ టాక్ మొదలు అయ్యింది. ఇటీవల సుష్మిత ఒక పోస్ట్ లో తాను 45 ఏళ్ల వయసులో తప్పు చేశానంటూ బాధను వ్యక్తం చేసింది. ఆ తప్పు ఏంటీ అనేది మాత్రం చెప్పలేదు. ఇదే సమయంలో అతడు సోషల్ మీడియా ద్వారా సుష్మిత గురించి మాట్లాడుతూ ఆమె గొప్పతనంను చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇంకా సుష్మితతో సన్నిహితంగానే ఉన్నట్లుగా ఆయన మాట్లాడాడు.
రోహ్మాన్ షాల్ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సుష్మిత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారంటూ ప్రశ్నించగా ఆమె ఉత్తమురాలు అంటూ సమాధానం ఇచ్చాడు. ఆమె గురించి మంచి క్వాలిటీ ఏమైనా చెప్పమంటూ ప్రశ్నించగా ఆమె ఒక అద్బుతం అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక మీరు సెలబ్రెటీ అన్నప్పుడు నేను నా సొంతంగా సెలబ్రెటీ హోదాను దక్కించుకోలేదు. సుష్మిత వల్లే తనకు ఆ హోదా వచ్చిందని గర్వం లేకుండా సింపుల్ గా చెప్పేశాడు.