యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి బాలీవుడ్ చిత్రంగా ఆదిపురుష్ రాబోతున్న విషయం తెల్సిందే. రామాయణ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన అధికారిక పోస్టర్ కాని.. వీడియో కాని విడుదల కాలేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీ అంటూ ఆదిపురుష్ గురించి గొప్పగా చెబుతున్నారు.
బాహుబలి.. 2.ఓ ఇతర సినిమాలను మించిన గ్రాఫిక్స్ వర్క్ ఆదిపురుష్ లో ఉండబోతుంది. బాలీవుడ్ లో గ్రాఫిక్స్ మూవీస్ అంటే ఇటీవల విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా యొక్క ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ లో ఉన్న గ్రాఫిక్స్ చూసి ఇదేం గ్రాఫిక్ వర్క్.. అమీర్ పేట్ లో నేర్చుకున్న కొత్త బ్యాచ్ చేసినట్లుగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.
బ్రహ్మాస్త్ర గ్రాఫిక్స్ ను అమీర్ పేట్ బ్యాచ్ చేసినట్లుగా ఉన్నాయంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో బాలీవుడ్ నుండి రాబోతున్న ఇతర భారీ వీఎఫ్‌ఎక్స్ మూవీస్ గురించి చర్చ మొదలు అయ్యింది. ఆదిపురుష్ కూడా బాలీవుడ్ లోనే రూపొందుతుంది కనుక గ్రాఫిక్స్ వర్క్ ఎలా ఉంటుందో అనే ఆందోళన మరియు ఒకింత ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రభాస్ అభిమానుల్లో ఉంది.
ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. ఈ ఆగస్టు లో సినిమాను విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.
షూటింగ్ పూర్తి అయిన తర్వాత దాదాపు ఏడు ఎనిమిది నెలల పాటు గ్రాఫిక్ వర్క్ ను నిర్వహిస్తున్నారు. మోషన్ గ్రాఫిక్స్ అంటూ చాలా హడావుడి చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వేళ గ్రాఫిక్స్ విషయంలో నాసిరకంగా అమీర్ పేట్ బ్యాచ్ గ్రాఫిక్స్ ఉన్నట్లుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూనిట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి గ్రాఫిక్స్ ను కాకుండా ఇండియన్ సినీ ప్రేమికులు ప్రేక్షకులు ఏ గ్రాఫికల్ మూవీని కూడా ఇప్పటి వరకు పెద్దగా ఆదరించిన దాఖలాలు లేవు. కనుక ఆదిపురుష్ పరిస్థితి ఏంటో చూడాలి.