పొంగల్ సినిమాలకు శాటిలైట్ పండగ

Update: 2016-01-11 13:30 GMT
పొంగల్ పోటీ పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఏ క్లాస్ సెంటర్లలో థియేటర్లు ఫిక్స్ అయిపోవడంతో.. ఇప్పుడు బీ, సీ సెంటర్ల బుకింగ్ కూడా జోరందుకుంది. కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే కాంప్రమైజ్ అవడంతో.. ఇప్పుడు శాటిలైట్ పై కూడా గట్టిగానే కన్నేశారు స్టార్ హీరోలు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రానికి నాలుగు నెలల క్రితమే శాటిలైట్ ఫైనల్ అయిపోయినట్లు వార్తలొచ్చాయి. జెమినీ టీవీ ఈ చిత్రానికి 9 కోట్లు చెల్లించి శాటిలైట్ బుక్ చేసుకుందని తెలుస్తోంది. రీసెంట్ గా శర్వానంద్ మూవీ ఎక్స్ ప్రెస్ రాజాకు కూడా బంపర్ ఆఫరే వచ్చింది. హిట్స్ తో జోరు మీద ఉండడంతో 3.25 కోట్లు ఇచ్చి మా టీవీ ఈ రైట్స్ ను దక్కించుకుంది. ఇప్పుడు మిగిలిన రెండు చిత్రాలకు కూడా శాటిలైట్ ఫైనల్ అయిపోయాయి. బాలకృష్ణ డిక్టేటర్ కు జెమీని టివి 6.5 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదిరినట్లు సమాచారం. నాగార్జున మూవీ సోగ్గాడే చిన్ని నాయనకు అదే రేటుకు, అదే ఛానల్ ఆఫర్ చేసిందట. మా టివి ఆఫర్‌ చేసిందని కొందరు చెబుతున్నారులే.

నాగ్ కెరీర్ లో ఇప్పటివరకూ మనం టాప్ మూవీ. జెమినీ ఇందుకోసం దాదాపు 8 కోట్లు చెల్లించిందట. ఇప్పుడా రికార్డు బ్రేక్ చేయకపోయినా.. మాస్ హీరో బాలకృష్ణ సినిమాతో సమానంగా క్లాస్ ఇమేజ్ ఉన్న నాగ్ మూవీకి కూడా రేట్ రావడం విశేషంగానే చెప్పాలి. మొత్తానికి పొంగల్ కి వస్తున్న సినిమాలన్నిటి మీదా అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. శాటిలైట్ రైట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. అన్ని మూవీస్ కి శాటిలైట్ రూపంలో భారీ రేట్ రావడం రికార్డుగానే చెప్పాలి.
Tags:    

Similar News