సందేహమే లేదు. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ‘సోగ్గాడే చిన్నినాయనా’నే. ఇప్పటికే ఈ సినిమా రూ.35 కోట్ల వసూళ్లతో ‘మనం’ సినిమా వసూళ్లను దాదాపు రీచ్ అయిపోయింది. ఇక నాగ్ కెరీర్ లో ఎప్పుడూ ఊహకైనా అందని రూ.40 కోట్ల మార్కు ఊరిస్తోందిప్పుడు. ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా రూ.40 కోట్ల మార్కును అందుకునే అవకాశముంది. తన సినిమా ఈ రేంజిలో వసూళ్ల వర్షం కురిపిస్తుందని బహుశా నాగార్జున కూడా ఊహించి ఉండడేమో. రెండో వీకెండ్ లో సైతం హౌస్ ఫు్ కలెక్షన్లతో అదరగొట్టింది ‘సోగ్గాడే చిన్నినాయనా’. వీకెండ్ తర్వాత కొంచెం జోరు తగ్గించినప్పటికీ.. మళ్లీ మూడో వీకెండ్ లో కలెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు.
ఒక్క నైజాం ఏరియాలోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ రూ.8 కోట్ల దాకా వసూళ్లు సాధించడం విశేషం. మామూలుగా నాగార్జున నైజాంలో కొంచెం వీకే. కానీ ‘సోగ్గాడే..’ మాత్రం అనూహ్యమైన వసూళ్లతో నాగ్ నైజాంలోనూ కింగ్ అని రుజువు చేసింది. నాగ్ సొంత బేనర్లో తెరకెక్కిన ఈ మూవీకి రూ.10 కోట్లకు మించి బడ్జెట్ అయి ఉండదని అంచనా వేస్తున్నారు. నాగార్జునే హీరో కాబట్టి పెద్ద పారితోషకం మైనస్. డైరెక్టరూ కొత్తవాడే. ఫారిన్ లొకేషన్లు లేవు. భారీ సెట్టింగులూ లేవు. అంతా కూడా చాలా సింపుల్ గా అయిపోయింది. నాగ్ కూడా మీడియం మరీ ఎక్కువ లాభాలు పెట్టుకోకుండానే సినిమాను అమ్మాడు. దీంతో బయ్యర్లు లాభాల పంట పండించుకుంటుున్నారు.