సోగ్గాడే చిన్నినాయన వచ్చిన్నప్పటి నుండి బంగార్రాజు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దాదాపు అయిదు ఏళ్లు అయిన తర్వాత బంగార్రాజు మొదలు అయ్యింది. నాగార్జునతో పాటు బంగార్రాజు లో నాగచైతన్య కూడా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ అక్కినేని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమా ను అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. సంక్రాంతి సీజన్ కు తగ్గ ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం వల్ల సోగ్గాడే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బంగార్రాజు సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. 2022 సంక్రాంతికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. ప్రభాస్ రాధే శ్యామ్.. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రాలతో పాటు ఎఫ్ 3.. ఆచార్య ఇంకా కొన్ని సినిమాలను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇన్ని సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి ఉండగా బంగార్రాజు సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలిపేలా ఉన్నారు. బంగార్రాజు సినిమా షూటింగ్ షెడ్యూల్ నుండి మొదలుకుని విడుదల తేదీ వరకు అన్ని కూడా ఫైనల్ అయ్యాయట. తక్కువ బడ్జెట్ లో తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సోగ్గాడే సినిమా తరహాలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సింపుల్ గా కలర్ ఫుల్ గా సినిమాను తీసుకు రాబోతున్నారు. సంక్రాంతికి ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సినిమాల్లో ఎన్ని వస్తాయి అనేది క్లారిటీ లేదు. కనుక ఏమాత్రం తగ్గకుండా సంక్రాంతికే బంగార్రాజును తీసుకు వచ్చి సోగ్గాడి సెంటిమెంట్ ను దక్కించుకోవాలని చూస్తున్నారు.
2022 సంక్రాంతికి బంగార్రాజు కూడా బరిలోకి దిగితే ఇప్పటికే పోటీ రసవత్తరంగా ఉంది. అది కాస్త మరింత జఠిలంగా మారే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సినిమాలు ఖచ్చితంగా ఉండక పోవచ్చు అని కొందరు అంటున్నారు. ఆ సమయంలో ఉండే పరిస్థితుల ఆధారంగా అటు ఇటుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా బంగార్రాజు ను మాత్రం సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తారట... చివరి నిమిషంలో ఏమైనా మారితే మాత్రం చెప్పలేం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అనధికారికంగా అంటున్నారు. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించబోతుంది. నాగార్జున జోడీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.