థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవుతాయో.. పూర్తి స్థాయిలో ఎప్పటికి రన్ అవుతాయో తెలియని పరిస్థితి. ఓపెన్ అయిన మళ్లీ క్లోజ్ కాకుండా కంటిన్యూగా రన్ అవుతాయనే నమ్మకం లేదు. ఓపెన్ అయినా కూడా మొదట పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. కనుక చిన్న సినిమాలు థియేటర్లలో రావడం చాలా పెద్ద ప్రహసనంగా మారింది. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా డైరెక్ట్ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి. చిన్న సినిమాలైనా కూడా క్రేజ్ ఉన్న సినిమాలకు మంచి మొత్తంను ఓటీటీ వారు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. కొన్ని సినిమాలను ఓటీటీ రిలీజ్ కు ఓకే చెప్తుంటే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ ను కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్దం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కాని మేకర్స్ మాత్రం ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో పెద్ద మొత్తాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ థియేటర్లలో విడుదల చేస్తే ఎంత వస్తుందో అంతకు మించి ఇచ్చేందుకు సిద్దం అయ్యిందట. కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం తమ సినిమాను థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారట. దాంతో సాలిడ్ ఆఫర్ ను కూడా వారు తిరష్కరించి శాటిలైట్ మరియు థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీ రైట్స్ ను అమ్మేశారు. ఈ రెండు రైట్స్ ద్వార దాదాపుగా రూ.10 కోట్ల రూపాయలను ఈ చిత్ర నిర్మాతలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
డైరెక్ట్ రిలీజ్ కు ఈ మొత్తంకు రెట్టింపు కంటే ఎక్కువగానే వచ్చేది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. కాని సినిమాపూ యూనిట్ సభ్యులు నమ్మకంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు నో చెప్పారని టాక్ వినిపిస్తుంది. సుధీర్ బాబు సాలిడ్ ఆఫర్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన మార్కెట్ మరింత పెరిగిందని దీంతో అర్థం అవుతుంది. పైగా ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. గత సినిమాతో సక్సెస్ ను దక్కించుకున్న ఈ దర్శకుడు శ్రీదేవి సోడా సెంటర్ తో కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకంను ప్రేక్షకులు కలిగి ఉన్నారు. అందుకే ఈ సినిమా కు భారీ మొత్తంలో ఓటీటీ వారు పెట్టేందుకు సిద్దం అయ్యారు.
పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్దం అయినా మేకర్స్ మాత్రం థియేటర్ రిలీజ్ కే సిద్దం అయ్యారు. ఇప్పటికే పూర్తి అయిన ఈ సినిమా విడుదల తేదీపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఆనంది నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఒక సింపుల్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ తో ఈ సినిమా రూపొందిందని.. కరుణ్ కుమార్ గత చిత్రం మాదిరిగానే మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.