ట్విట్టర్లో దొరికిన మహేష్ బాబు ఫేక్ డైరెక్టర్..!

Update: 2020-08-05 10:30 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ ఓకే చేసిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ అప్ కమింగ్ మూవీ పై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మహేష్ అధికారికంగా సర్కారు వారి పాట టైటిల్ ప్రకటించి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేష్ లుక్ చాలా డిఫెరెంటుగా ప్లాన్ చేశారు. “సర్కారు వారి పాట” అంటూ యూనిక్ టైటిల్ విడుదల చేయగానే మూవీ పై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

ఇక ప్రీ లుక్ లో మహేష్ న్యూ మేక్ ఓవర్ కూడా అభిమానులకు అల్టిమేట్ ఎనర్జీ ఇచ్చిందని చెప్పాలి. అలా టైటిల్ విడుదల చేశారో లేదో దేశవ్యాప్తంగా మహేష్ ఫ్యాన్స్ అంతా భారీ ట్రెండ్ క్రియేట్ చేశారు. అయితే సర్కారు వారి పాట సినిమాను గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌ నుండి మొదలవుతుందని సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ నటించనుంది. ఇదిలా ఉండగా ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదొక సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఒక వీడియో గ్లిమ్ప్స్ రాబోతుందని అంతా అనుకుంటుంటే..

ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట టైటిల్ ట్రాక్ రిలీజ్ చేస్తారని చెప్పినట్లు వార్త హల్చల్ చేస్తోంది. ఈ ప్రకటనతో అభిమానులలో కోలాహలం మొదలైనది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. టైటిల్ ట్రాక్ రిలీజ్ గురించి పోస్ట్ చేసింది నకిలీ పరశురామ్. అవును! ఎవరో డైరెక్టర్ పరశురామ్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మహేష్ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తున్నారట. ఇక అసలు విషయం తెలియక జనాలు ఈ అకౌంటును తెగ ఫాలో అవుతున్నారట. ఈ విషయం తెలిసే సరికి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ తప్పదుగా.. అసలు డైరెక్టర్ వేరే. ఇదిలా ఉండగా మహేష్ నుండి ఖచ్చితంగా ఏదొక అప్డేట్ వస్తుందని మాత్రం అంచనా వేయొచ్చు.
Tags:    

Similar News