మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నాడు. ఇది అఫిసియల్ న్యూస్. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంతకు మించి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ సినిమా గురించి రాలేదు. కాని ప్రతి రోజు ఏదో ఒక పుకారు లూసీఫర్ రీమేక్ గురించి సోషల్ మీడియా లేదా వెబ్ మీడియాలో షికారు చేస్తూనే ఉంది. హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ఒరిజినల్ వర్షన్ లో హీరోయిన్ పాత్ర ఉండదు. కాని తెలుగు లో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హీరోయిన్ పాత్రను క్రియేట్ చేస్తున్నారని సమాచారం.
వకీల్ సాబ్ లో శృతి హాసన్ పాత్రను ఎలా అయితే జొప్పించే ప్రయత్నం చేశారో.. లూసీఫర్ రీమేక్ లో కూడా చిరంజీవి పాత్రకు జోడీని క్రియేట్ చేసేందుకు ప్రత్యేక ట్రాక్ ను రాసినట్లుగా తెలుస్తోంది. లూసీఫర్ రీమేక్ లో హీరోయిన్ పాత్ర ఉండేది పరిమితమే. కథలో భాగం కూడా కాదు. పది నుండి పది హేను రోజుల డేట్లతోనే హీరోయిన్ పాత్రను షూట్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేస్తారనే వార్తలు వచ్చాయి. కాని తర్వాత మరో హీరోయిన్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అనుష్క పేరు వినిపిస్తుంది.
లూసీఫర్ రీమేక్ లో చిరంజీవి పాత్రకు తగ్గట్లుగా హుందాగా అనుష్క ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఆమె చిన్న పాత్రల్లో కూడా నటించేందుకు ఓకే చెప్పే అవకాశం ఉందని.. అందుకే అనుష్కను సంప్రదించారనే పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతో కాని చిరంజీవి తో అనుష్కను చూడాలని మెగా అభిమానులు ముచ్చట పడుతున్నారు. సినిమా మొదలు అవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో కాని ప్రకటించినప్పటి నుండి పుకార్లే పుకార్లు.