కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలు మరియు ముందే ఈ సమ్మర్ లో విడుదల అవ్వాలి అనుకున్న సినిమాల ఇలా చాలా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ నెల నుండి విడుదల తేదీల హడావుడి కనిపిస్తుంది. పెద్ద సినిమాలు.. బడా హీరోల సినిమాలు.. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు చాలా ఉన్నాయి కనుక క్లాష్ కాకుండా ముందు జాగ్రత్తతో నిర్మాతలు మాట్లాడుకుని అందరి ఒప్పందంతో విడుదల తేదీలు నిర్ణయించుకున్నారు.
ఈ ఫిబ్రవరి మొదలుకుని ఏప్రిల్ మరియు మే నెల వరకు వరుసగా సినిమాల విడుదల కు ఆయా సినిమాల నిర్మాతలు ఒక ఒప్పందంకు వచ్చారు. అందులో భాగంగా మంచు వారి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.
పెద్ద సినిమాల విడుదల హడావుడి మొదలు కాకుండానే ఈ నెలలోనే మంచు మోహన్ బాబు నటించిన 'సన్నాఫ్ ఇండియా' విడుదల కాబోతుంది. ఈనెల 18న థియేటర్ల ద్వారా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయేబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రథాన పాత్రలో నటించిన సినిమా అవ్వడంతో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో కూడా అంచనాలు మరియు ఆసక్తి కనిపిస్తుంది. మోహన్ బాబు లుక్ ఇప్పటికే అభిమానులకు నచ్చింది. తప్పకుండా మోహన్ బాబుకు ఈ సినిమా మరో మంచి సినిమా గా నిలుస్తుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు. సన్నాఫ్ ఇండియా టైటిల్ ను చూస్తుంటేనే ఇది ఒక దేశ భక్తిని కలిగించే సినిమా అనిపిస్తుంది. కనుక కంటెంట్ కాస్త బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు దేశ భక్తితో థియేటర్లకు క్యూ కడుతారనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
మోహన్ బాబు తో ఈ సినిమా ను స్వయంగా ఆయన తనయుడు మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ బ్యానర్ లో నిర్మించాడు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు ఇళయరాజా అందించిన సంగీతం ప్రథాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. తప్పకుండా ఈ సినిమా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.
ఇప్పటికే విడుదల అయిన సన్నాఫ్ ఇండియా పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేవిధంగా ఉన్నాయి అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా ఎక్కువ సమయం లేదు కనుక అతి త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇక కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఫిబ్రవరి లో కూడా ఉంటుందనే చాలా మంది ఇంకా నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా ను విడుదల చేయడం.. అంతే కాకుండా ఏపీలో థియేటర్ల వద్ద ఇంకా పరిస్థితి గందరగోళంగానే ఉంది. టికెట్ల రేట్లు మరియు 50 శాతం ఆక్యుపెన్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం అప్పటి వరకు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా.. మోహన్ బాబు సినిమాకు కలిసి వస్తుందా అనేది చూడాలి.