మోహన్ బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన సన్నాఫ్ ఇండియా సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మోహన్ బాబు వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర దేశంను పట్టి పీడిస్తున్న సమస్యలపై పోరాటం చేసే పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలోని డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. మోహన్ బాబు ఈ సినిమాలో గొప్ప దేశ పౌరుడిగా కనిపించబోతున్నాడు. సినిమాలోని డైలాగ్ ప్రతి ఒక్కటి కూడా దేశ భక్తిని పెంపొందించేలా ఉన్నాయి.
ఈ సినిమా ట్రైలర్ లోని డైలాగ్స్ విషయానికి వస్తే.. ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. ప్రపంచం అంతా నా కుటుంబం ప్రపంచం బాధే నా బాధ.ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నేను దాన్నే ఫాలో అవుతున్నాను. డబ్బున్నోడికి ఓ న్యాయం, డబ్బులేనోడికి ఓ న్యాయం... పవర్ ఉన్నోడికి ఓ న్యాయం, పవర్ లేనోడికి ఓ న్యాయం.. డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉండటం ఎందుకు.అయ్యోధ్య లో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ సొసైటీ లో ఉన్న చెత్త నా కొడుకులని, క్రిమనల్ నా కొడుకులని ఏరిపారేయాలి.పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది.ప్రశ్నలన్నింటికి సమాధానం నీతో పాటు 135 కోట్ల ఇండియన్స్ కి చాలా డిటైయిల్డ్ గా చెబుతాను అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయి.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెంచేసిన మేకర్స్ సినిమా తో కూడా మెప్పిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మోహన్ బాబు లుక్ మరియు ఇతర అంశాలు అన్ని కూడా సినిమా పై అంచనాలు మరింతగా పెంచేలా ఉన్నాయి. కనుక సన్నాఫ్ ఇండియా సినిమాతో మోహన్ బాబు మళ్లీ హీరోగా వరుసగా సినిమాలు చేస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మంచు విష్ణు కు నిర్మాతగా గత కొంత కాలంగా నిరాశే మిగులుతుంది. మరి ఈ సినిమాతో కమర్షియల్ హిట్ దక్కేనా అనేది కూడా చూడాలి.
Full View