ట్విట్టర్' కి గుడ్ బై చెప్పిన సోనాక్షి..కారణం అదేనట!

Update: 2020-06-20 16:30 GMT
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్‌ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. మొదటి సినిమాతోనే లక్షల హృదయాలను కొల్లగొట్టిన సోనాక్షి.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్డంను సంపాదించుకుంది. గత కొంతకాలంగా సినిమాలు తగ్గించిన సోనాక్షి చివరిగా కనిపించింది సినిమా సల్మాన్ ఖాన్ దబాంగ్ 3. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి తప్పుకుంటుందట. ఈ బ్యూటీ ఇకపై ట్విటర్‌లో కనిపించదట. స్టార్‌ హీరోయిన్ గా వెలుగొందుతున్న సోనాక్షి.. నెగిటివిటికి దూరంగా ఉండాలి అనుకుంటుందంట. మనఃశాంతిని కాపాడు​ కోవడానికి, నెగిటివిటికి దూరంగా ఉండటానికి ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేశానని సోనాక్షి తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శనివారం ప్రకటించింది.

అమ్మడు నెటిజన్లకు.. అభిమానులకు.. సోషల్ మీడియా ద్వారా సందేశం అందిస్తూ.. ‘మీ మనఃశాంతిని కాపాడుకుకోవడానికి మొదట చేయవలసింది నెగిటివిటికీ దూరంగా ఉండటం. ఇది ట్విటర్‌ కంటే ఎక్కువ ఇంకెక్కడ ఉండదు. ఛలో, నేను నా అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేస్తున్నాను’ అంటూ పిలుపునిచ్చి సెలవు ప్రకటించింది. దాదాపు రెండు కోట్ల ఫాలోయింగ్ కలిగిన ఈ అమ్మడు తన పోస్ట్‌కు కామెంట్‌ సెక్షన్‌ను కూడా డిసేబుల్‌ చేసింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సోనాక్షి 1320 పోస్టులు చేసింది. ఇటీవల జరిగిన సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య నేపథ్యంలో స్టార్‌ కిడ్స్‌ని అన్‌ ఫాలో చేస్తూ.. ట్రోల్‌ చేస్తున్న సందర్భంగా సోనాక్షి ఈ నిర్ణయం తీసుకుందని అంతా అనుకుంటున్నారు. ఈ వార్త తెలిసి సోనాక్షి అభిమానుల గుండెలు బద్దలు అవుతున్నాయి. సోనాక్షి తన ట్విట్టర్ డియాక్టీవేట్ చేస్తున్న విషయం చెప్పింది కానీ మళ్లీ ఎప్పుడు పునః ప్రారంభం చేస్తాననేది చెప్పలేదు.
Tags:    

Similar News