ఫోటో స్టోరి: గ్లామర్ బిరుదు దూరమేనా?

Update: 2016-01-29 13:30 GMT
సోనాక్షి సిన్హా.. గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త స్పెల్లింగులు రాసేస్తూ ఉంటారు బాలీవుడ్ భామలు. ఒక్కసారి ప్రేక్షకులతో గ్లామర్ డాల్ అనిపించుకోవడం, ఇండస్ట్రీలో అందలాలు ఎక్కడమే అసలు టార్గెట్. స్టార్ స్టేటస్  పట్టేయాలి.. ఇదీ మెయిన్ టార్గెట్. కానీ ఇదేం అంత ఈజీ వ్యవహారం కాదనే విషయం.. సోనాక్షి సిన్హాను చూస్తే అర్ధమవుతుంది.

సోనాక్షి ఖాతాలో మంచి మంచి హిట్స్ ఉన్నాయి. కావాల్సినంత గుర్తింపు ఉంది. బోలెడు మంది ఫాలోయర్స్ ఉన్నారు. అన్నింటకీ మించి తండ్రి శతృఘ్న సిన్హా అండ ఉంది. ఇన్ని ఉన్నా కానీ స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఇంకా ఆపసోపాలు పడుతూనే ఉంది. దబాంగ్ మూవీ తో అరంగేట్రం తోనే మాస్ మూవీస్ కి పర్ ఫెక్ట్ అని కితాబు అందుకుంది. తర్వాత కూడా ఈ రేంజ్ మాస్ బ్లాక్ బస్టర్స్ బాగానే పడ్డాయి. కొంతకాలానికి ఇలాంటి వాటికే పరిమితం అయిపోతూ ఉండడంతో.. జాగ్రత్త పడ్డం మొదలుపెట్టింది. గ్లామర్ పై దృష్టి పెట్టి , బాడీని బాగా తగ్గించింది.

అక్కడి నుంచి అందాల భామ అనిపించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఈమె ఎంత ప్రయత్నించినా కూడా హాట్‌ లుక్‌ మాత్రం రావట్లేదు. అలాగే స్టార్ డమ్‌ కూడా రావట్లేదు. ఈ తరం బాలీవుడ్ కుర్రభామల్లో ఇంతగా గ్లామర్ కోసం పాకులాడాల్సిన అవసరం ఈమెకు తప్ప ఎవరికీ లేదనే చెప్పాలి. సోనమ్ కపూర్ లాంటి వయ్యారి భామలైతే.. గ్లామర్ తప్ప వేరే ఏం అవసరం లేదన్నట్లుగా ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఇంకా కష్టాలు పడుతూనే ఉంది. అందులో భాగమే పై ఫోటో షూట్ కూడా. 
Tags:    

Similar News