వాటర్ బీబీ సోనాల్ చౌహాన్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇటీవల మాల్దీవుల విహారం గోవా ట్రిప్ తో మతులు చెడగొట్టింది ఈ బ్యూటీ. వరుసగా బికినీలు స్విమ్ సూట్లతో మసాలా గాళ్ గా పాపులరైంది. జనవరిలో సోనాల్ బీచ్ వెకేషన్ నుంచి పింక్ బికినీ అంతర్జాలంలో ఒక్కసారిగా అగ్గి రాజేసింది. ఇప్పటికీ పింక్ బికినీ త్రోబ్యాక్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. యూత్ విరివిగా ఈ ఫోటోల్ని షేర్ చేస్తుండడం విశేషం.
ఇకపోతే సోనాల్ ప్రస్తుతం టాలీవుడ్ ఓ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎఫ్ 3 - ఘోస్ట్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇంతకుముందు సోనాల్ చౌహాన్ దుబాయ్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసింది. అక్కడ ఆమె నాగార్జున `ది ఘోస్ట్` చిత్రీకరణలో పాల్గొంది. ఇందులో సోనాల్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తోంది. సీరియస్ యాక్షన్ క్వీన్ గా సోనాల్ అలరించనుంది. నాగ్ (మాజీ RAW ఏజెంట్)కి ఒక మిషన్ లో సహాయం చేసే RAW ఏజెంట్‌గా నటించింది. స్టైలింగ్ నుండి భంగిమ వరకు బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతిదీ సోనాల్ మేకోవర్ ట్రై చేసిందని తెలిసింది.
బాడీ పరంగా మేకోవర్ తో పాటు ఆమె భారీ ఆయుధాలలో విస్తృతమైన శిక్షణను కూడా తీసుకుంది. రైఫిల్ షూటింగ్- మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) పోరాట ఆయుధాల నిర్వహణ స్వీయ-రక్షణ పద్ధతులను నేర్చుకుంది. తన అనుభవాన్ని ఇంతకుముందు సోనాల్ అద్భుతంగా వెల్లడించింది.
``నేను ఇంతకు ముందెన్నడూ యాక్షన్ సీక్వెన్స్ లు చేయలేదు.. ఫైటింగులు చేయడం ఇదే మొదటిసారి. నేను ఈ మూవీ కోసం ఎంపికైనప్పటి నుంచి పాత్ర కోసం ప్రిపరేషన్ ప్రారంభించాను`` అని సోనాల్ చెప్పారు. నేను జనవరిలో హైదరాబాద్ లో రోజుకు ఆరు గంటలు పని చేస్తూ ఒక నెల కఠినంగా శిక్షణ పొందాను. ఇది చాలా నేర్పింది అని తెలిపింది.
ఇలా చేయడం బావుంది గనుక షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా తన శిక్షణను కొనసాగించాలని భావిస్తున్నట్లు సోనాల్ చెప్పింది. ఇది నా కొత్త అభిరుచి.. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. నన్ను నేను కనుగొన్నట్లుగా ఉంది.. అని సోనాల్ చెప్పింది. డైరెక్టర్ నన్ను మెచ్చుకున్నారు. మీరు నిజంగా ప్రొఫెషనల్ షూటర్ కావచ్చు అని పొగిడేశారట.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MAA) శిక్షణ సమయంలోనే ఆమె తన సామర్థ్యాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. శారీరకంగా బలంగా ఉండటమే కాకుండా.. పోరాటాలు లేదా MAA క్రీడలలో శిక్షణ మిమ్మల్ని మానసికంగా దృఢంగా చేస్తుంది. ఈ శిక్షణ స్వీయ-ఆవిష్కరణ వంటిది. మీరు వేసే ప్రతి తొలి అడుగు చాలా వైవిధ్యాన్ని చూపిస్తుంది. మనల్ని ముందుకు తీసుకువెళుతుందని నేను గ్రహించాను`` అని ఆమె తెలిపింది.
బలమైన స్త్రీ పాత్రలను సృష్టించినందుకు దర్శకరచయితలకు కృతజ్ఞతలు తెలుపుతూ OTT కోసం పాత్రలను రాసే విధానంలో మార్పు కనిపిస్తోందని సోనాల్ చెప్పింది. భారతదేశంలో పరిస్థితులు ఖచ్చితంగా మారుతున్నాయి. మహమ్మారి కారణంగా OTT వేగంగా పాపులరైంది. ఇది థియేటర్ల నుండి నంబర్స్ గేమ్ ను తీసివేసింది. కానీ ఇది ప్రారంభం మాత్రమే .. ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది. మహిళల కోసం మరిన్ని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలు రాయాలి. మహిళా సూపర్ హీరోలుగా మారేందుకు మేము సిద్ధంగా ఉన్నామని నేను భావిస్తున్నాను``అని అంది.
మొదట్లో ది ఘోస్ట్ సెట్స్ లో చేరినప్పుడు సోనాల్ కు నాగార్జునతో పరిమితమైన ఇంటరాక్షన్ ను కలిగి ఉండగా.. దుబాయ్ షెడ్యూల్ లో కింగ్ తో కలిసి యాక్షన్ సీన్స్ లో విరుచుకుపడుతోంది. నాగ్ ను మనోహరమైన తెలివైన అద్భుతమైన సహనటుడిగా అభివర్ణించింది. ``నాగార్జున హాస్యం గొప్ప భావం ఆకట్టుకుంటాయి`` అని వెల్లడిస్తుంది, అతను విస్తృత శ్రేణి అంశాలపై మాట్లాడగలడు.
"షాట్ విరామ సమయంలో మేము ఆహారం.. ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకున్నాం.అని తెలిపింది. దుబాయ్ లో షూటింగ్ చేసిన అనుభవం తాను ఊహించిన దానికంటే బాగానే ఉందని చెప్పింది. అదృష్టవశాత్తూ ఎడారిలో షూటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు మినహా చాలా సమయం వాతావరణం ఆహ్లాదకరంగా ఎండగా ఉంది అని సోనాల్ చెప్పింది.
తెలుగులో బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలను షూట్ చేయడం ఆనందంగా ఉందని వెల్లడించింది. F3 - ది ఘోస్ట్ చిత్రాల్లో రెండు పాత్రలు పూర్తి విరుద్ధంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. నటులుగా ఈ వైవిధ్యం కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పింది. F3లో నా పాత్ర హాస్యభరితమైనది.. అయితే `ది ఘోస్ట్`లో నా పాత్ర యాక్షన్ తో నిండి ఉంటుంది.. అని వెల్లడించింది.