ప్రేమ నిజ‌మే..కానీ ఆ ప్రేమ ఎవ‌రితో సోనాల్?

Update: 2022-02-26 23:30 GMT
ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహాన్ కెరీర్ ప్రారంభించి 14 ఏళ్లు గ‌డుస్తున్నా ఏదశ‌లోనూ బిజీ న‌టిగా మార‌లేక‌పోయింది. తెలుగులో న‌ట‌సింహ బాల‌కృష్ణ ఆమెని ప్రోత్స‌హించి అవ‌కాశాలిచ్చారు. సెకెండ్ లీడ్ లో బాల‌య్య స‌ర‌స‌న న‌టించింది సోనాల్.  కానీ ఆ సెంటిమెంట్ ఎక్క‌డా వ‌ర్కౌట్ కాలేదు. ప్ర‌స్తుతం `ఎఫ్ -3` లో న‌టిస్తోంది.

అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో సోనాల్ రోల్  ఎలా ఉంటుంద‌న్ని తెలియాలి. ఇప్ప‌టికే అందులో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. త‌మ‌న్నా.. మెహ‌రీన్ మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. మ‌రి సోనాల్ పాత్ర ప్ర‌త్యేక‌త ఏంట‌న్న‌ది ఆస‌క్తిక‌రం. సోనాల్ ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆశ‌ప‌డుతోంది. ఇక బాలీవుడ్లోనూ సోనాల్ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోంది. అక్క‌డా అంత బిజీ స్టార్ గా మార‌లేక‌పోతుంది.  గ‌త ఏడాది `ది ప‌వ‌ర్`  అనే సినిమాలో న‌టించింది.  ఆ సినిమా  పై చాలా ఆశ‌లే పెట్టుకుంది. కానీ టైమ్ ఏమాత్రం క‌లిసి రాలేదు.

ప్ర‌స్తుతం `ఎఫ్ 3` పైనే  హోప్స్ అన్ని ఉన్నాయి. మ‌రి  సోనాల్ టైమ్ ఎలా ఉంద‌న్నది?  కొన్నాళ్లు  ఆగితే గాని తెలియ‌దు. ఇక సోనాల్ చౌహాన్ ఇన్ స్టా లో నిత్యం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల్ని షేర్ చేసి యువ‌త‌ అటెన్ష‌న్ డ్రా చేస్తుంది.

సినిమాలో గ్యాప్ ఏర్ప‌డినా సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం  ఆ గ్యాప్ ని భ‌ర్తీ చేస్తుంది. తాజాగా సోనాల్ కొత్త ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. మెడ‌లో డిజైన్డ్  ముత్యాల హారాం ధ‌రించింది...చెవుల‌కి అవే ముత్యాల పోగులు ధ‌రించింది. స్కిన్ టైట్  న‌లుపు దుస్తుల్లో మొత్త‌టి ప‌రుపై కూర్చుని వైడ్ యాంగి్ లో కెమారాకి ఫోజులిచ్చింది. ఆ ఫోటోని ఉద్దేశించి `ఓన్లీ ల‌వ్ ఈజ్ రియ‌ల్` అని కామెంట్ చేసింది. మ‌రి ఈ ల‌వ్ ఎవ‌రిపై అన్న‌దే ఆస‌క్తిక‌రం. సోనాల్ పై పెద్ద‌గా ఎఫైర్ క‌థ‌నాలు కూడా లేవు.

గ‌తంలో  షాహిల్ జారే అనే యువ‌కుడితో కొన్నాళ్ల పాటు ప్రేమాయ‌ణం న‌డిపింది. కానీ అత‌గాడు ఓ డ్ర‌గ్స్ కేసులో పట్టుబ‌డ‌టంతో దూర‌మైంది.  ఆ త‌ర్వాత ఎవ‌రితోనూ రిలేష‌న్స్ పెట్టుకోలేదు.  సినిమా అవ‌కాశాలు రాక‌పోయినా ఖాళీగా స‌మ‌యాన్ని గ‌డిపింది.

వ్య‌క్తిగ‌త ప్ర‌య‌త్నాలు త‌ప్ప ఎలాంటి ఎఫైర్ వార్త‌ల్లోనూ సోనాల్ పేరు ఏనాడు వినిపించింది లేదు. మ‌రి తాజాగా ప్రేమ గురించి కామెంట్ చేసింది. పైగా ల‌వ్ సింబ‌ల్ ఎమోజీల‌ను సైతం పోస్ట్ చేసింది. ఎవ‌రితోనైనా మ‌ళ్లీ ప్రేమలో ప‌డిందా? అన్న సంకేతాలు అందిస్తుందా? అని సందేహాలు మొద‌ల‌య్యాయి.
Tags:    

Similar News