బాలకృష్ణతో జతకట్టాక సోనాల్ జాతకమే మారిపోయింది. అప్పటిదాకా ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్రపడ్డ ఆమె ఇప్పుడు సత్తా చాటుతోంది. క్రేజీ ఆఫర్లు అందుకొంటూ అదరగొడుతోంది. అలాగని తనకు లక్కు తీసుకొచ్చిన బాలయ్యని మాత్రం మరిచిపోలేదు. ఆయనతో కలిసి నటిస్తూనే ఉంటానని చెబుతోంది. ప్రస్తుతం `డిక్టేటర్`లో బాలకృష్ణతో కలిసి నటిస్తున్న సోనాల్ చేతిలో `షేర్`తో పాటు, `సైజ్ జీరో` అనే చిత్రం కూడా ఉంది. `రెయిన్‌బో` అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సోనాల్ ఆ చిత్రం ఫెయిల్యూర్ కావడంతో ఇక మళ్లీ ఇటు తిరిగి చూడలేదు.
అయితే ఎలా ఛాన్స్ కొట్టిందో తెలియదు కానీ... బాలయ్య `లెజెండ్`తో మళ్లీ ఛాన్స్ కొట్టి తెలుగు తెరపై మెరిసిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్టు కావడంతో ఇప్పుడు వరసగా అవకాశాలు అందుకొంటోంది. ``ఇంకా నా జోరు ఏం చూశారూ? తెలుగులో ఇది నాకు ఆరంభం మాత్రమే. ముందు ముందు మరింతగా ఆదరగొడతా`` అని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలయ్య గురించి, తన కెరీర్ గురించి బోలెడన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ``బాలయ్య షార్ట్ టెంపర్ అని నాతో చాలా మంది చెప్పారు కానీ... ఆయన మాత్రం బంగారం. నేను కలిసిన మంచి మ నుషుల్లో ఆయన ఒకరు. సెట్‌లో ఎంత బాగా చూసుకొంటారో తెలుసా?`` అని తన హీరో గురించి గొప్పగా చెప్పుకొచ్చింది సోనాల్. ఆయన నిజంగా నా లక్కీ ఛార్మ్ అని సెలవిచ్చింది. కేవలం అందాల పాత్రలకే పరిమితం కాననీ... అవకాశమిస్తే అరవయ్యేళ్ల ముసలమ్మగా నటించడానికైనా నేను రెడీనే అని చెప్పుకొచ్చింది సోనాల్.