పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు..హిందీలో ఓ రౌంత్ దర్శకత్వంలో `ఆదిపురుష్ -3డీ` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిగా...సీతగా కృతి సనన్.. లక్ష్మణుడి పాత్రలో సన్నిసింగ్ నటిస్తున్నారు. ఇక `రామాయాణం`లో మరో అత్యంత కీలక పాత్ర అయిన రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖ్ నటిస్తున్నారు.
టీ సిరీస్-రెట్రోఫిలైస్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇలా `ఆదిపురుష్` భారీ కాన్సాప్ పై తెరకెక్కుతోంది. చాలా భాగం షూటింగ్ ఇండియాలోనే వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఎక్కువగా ముంబై..హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా సెట్లు వేసి తెరకెక్కించారు. అవసరం మేర విదేశాల్లో షూటింగ్ చేసారు. తాజాగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ రోల్ అప్ డేట్ అందింది. ఆది పురుష్ లో నటి సోనాల్ చౌహాన్ కూడా నటిస్తుందిట. ఈ విషయాన్ని ఓ బాలీవుడ్ న్యూస్ పోర్టల్ కి సోనాల్ తెలిపింది.
ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు పూర్తి భిన్నం. వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎంతో కొత్తగా ఉంది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే రోల్ ఇది. `రామాయణం` అందరికీ తెలిసిన కథ కాబట్టి నా పాత్ర సులభంగా రీచ్ అవుతుందని సోనాల్ ధీమా వ్యక్తం చేసింది. మొత్తానికి సోనాల్ చౌహాన్ కి కెరీర్ లోనే చెప్పుకోదగ్గ రోల్ వచ్చిందని చెప్పొచ్చు.
పాన్ ఇండియా కేటగిరి సినిమాలో నటించే అరుదైన అవకాశం ఒడిసిపట్టుకుంది. హిందీ..తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సోనాల్ పరిచయం అవుతుంది. సోనాల్ నటిగా సక్సెస్ అవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. బాలయ్య రూపంలో కొన్ని ఛాన్సెస్ అందుకుంది. కానీ నిలదొక్కుకోలేకపోయింది.
ఆమె చివరిగా తెలుగులో `రూలర్` లోనటించింది. ఆ సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ అనంతరం అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎప్ -3` లో ఛాన్స్ అందుకుంది. తాజాగా పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించడంతో అమ్మడి పేరు అదే కేటగిరిలో ప్రమోట్ అవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా సక్సెస్ అయితే గనుక సోనాల్ కెరీర్ కి టర్నింగ్ ఛాన్స్ గానే చెప్పొచ్చు. ఆ సక్సెస్ తో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.