ఆ విష‌యంలో మ‌ధ‌న‌ప‌డిన సోనాలిబింద్రే

Update: 2018-07-19 11:17 GMT
నాకు క్యాన్స‌ర్ సోకింద‌ని మా అబ్బాయికి ఎలా చెప్పాలి?  త‌న‌కి ఆ విష‌యం చెప్ప‌డం చాలా ముఖ్య‌మ‌ని మాకు తెలుసు. ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌తో నిజాయ‌తీగా ఓపెన్‌గా ఉన్నాం. కానీ 12 యేళ్ల ప‌సి వ‌య‌సు ఈ విష‌యాన్ని త‌ట్టుకుంటుందా? 
... ఇలా ప్ర‌ముఖ క‌థానాయిక సోనాలి బింద్రే త‌నకొచ్చిన క్యాన్స‌ర్ జ‌బ్బు గురించి త‌న కొడుకుకు చెప్పే విష‌యంలో చాలా మ‌థ‌న‌ప‌డింది. ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో కూడా  అంతే బాధ‌తో షేర్ చేసుకొంది.

అయితే సోనాలి - ఆమె భ‌ర్త గోల్డీ బెహ‌ల్ ఎట్ట‌కేల‌కి వాళ్ల అబ్బాయి ర‌ణ్‌ వీర్‌ కి అస‌లు విష‌యం చెప్పారు. ర‌ణ్‌ వీర్ కూడా ఎంతో ప‌రిణ‌తితో... ఆ విష‌యాన్ని స్వీక‌రించి త‌ల్లికి ధైర్యం నూరిపోశాడ‌ట‌. అదే విష‌యాన్ని ఆమె నెటిజ‌న్ల‌తో పంచుకొని భావోద్వేగానికి గురైంది. ప్ర‌స్తుతం సోనాలి లండ‌న్‌ లో క్యాన్స‌ర్‌ కి సంబంధించిన చికిత్స తీసుకొంటోంది. మొద‌ట్నుంచీ ఆమె ధైర్యంగానే క్యాన్స‌ర్‌ పై పోరాడుతోంది. అయితే త‌న కొడుకు  ర‌ణ్‌ వీర్ విష‌యంలోనే ఇటీవ‌ల  కాస్త భావోద్వేగానికి గుర‌యింది.  ర‌ణ్‌వీర్ కూడా త‌ల్లికే ధైర్యం నూరిపోయ‌డంతో సోనాలి ఇప్పుడు చికిత్స తీసుకొని, త్వ‌ర‌గా కోలుకోవ‌డంపై దృష్టిపెట్టింది. సోనాలి హిందీతో పాటు - తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకొంది. ఆమెకి క్యాన్స‌ర్ అన‌గానే సినిమా వ‌ర్గాలు - ప్రేక్ష‌కులు హ‌తాశుల‌య్యారు.
Tags:    

Similar News