ఈ మధ్యకాలంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ సినిమా ఇండస్ట్రీలోని అవకాశం ఉన్న ప్రతీ స్టారూ బ్రాండ్ ఎండార్స్ మెంట్ తో బిజిగా ఉంటున్నారు. బడా బడా కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తుండటంతో ఏ స్టారూ ఏమాత్రం తగ్గకుండా చేసుకుంటూపోతున్నారు. ఈ క్రమంలో తారలందరూ తమ స్టార్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.. ఎడాపెడా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ చేసేస్తూ వీలైనంత వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారు!! అయితే ఇలా అందరి స్టార్స్ లానే అన్ని రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే - ఫెయిర్ నెస్ క్రీం యాడ్ లను ఎండార్స్ చేయనంటూ ప్రకటించింది.
తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సోనాలి బింద్రే ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. చిన్నవయసులో డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఆ యాడ్స్ చేశాను కానీ... ఇక మీదట అలాంటి ఆఫర్ అంగీకరించనని తెలిపింది. కాగా, టివి కామెడీ షోలో హీరోయిన్ తనీషా చటర్జీ స్కిన్ టోన్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో... ఓ ఒక వ్యక్తి స్కిన్ టోన్ గురించి జోక్స్ వేయటం చాలా పెద్ద తప్పని సోనాలి అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రస్తుత సమాజం స్పందన బాగుందని తెలిపింది.
కాగా... పాకిస్థాన్ కళాకారులను భారత్ లో నిషేదించాలని వినిపిస్తున్న డిమాండ్ పై కూడా సోనాలి స్పందించిందని తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంటే చాలా సున్నితమైన పరిశ్రమ గా ఉందని, ఈ కండిషన్ కేవలం సినిమా పరిశ్రమకే కాకుండా... పాక్ తో సంబందం ఉన్న అన్ని వ్యాపారాలకు వర్తిస్తే బాగుంటుందని అభిప్రాయపడిందని వార్తలు వస్తున్నాయి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/