సోనాలి బింద్రే..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Update: 2018-07-10 10:50 GMT
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ సోనాలి బింద్రేకు తాజాగా క్యాన్సర్ సోకిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలికి క్యాన్సర్ అని తెలిసి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు - వివిధ వర్గాల నుంచి ఆమెకు సానుభూతి వ్యక్తమైంది. తనకు సపోర్టుగా నిలిచిన వారందరికీ సోనాలి కృతజ్ఞతలు కూడా తెలిపింది.  తమ స్ఫూర్తిమంతమైన కథనాలతో నాలో ధైర్యం నింపుతున్నవారికి రుణ‌పడి ఉంటాను. ప్రస్తుతం నా జీవితంలో ప్రతి రోజూ ఓ సవాలుతో కూడుకున్నదే.. సూర్యోదయం కోసం సానుకూల దృక్పథంతో ఎదురు చూస్తుంటా అని ఆమె భావోద్వేగంతో తన మనస్సులోని మాటలను బయటపెట్టింది.

ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్న సోనాలి బింద్రే తన లేటెస్ట్ ఫొటోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.  ఈ ఫొటోలో ఆమె జుట్టు మొత్తం కుంచుకుపోయింది. బుగ్గలు - ముఖం మొత్తం చిన్నగా మారిపోయింది. మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయిన వ్యక్తిలా కనిపిస్తున్నారు..

అయితే ఆమె ఎంత బాధలో ఉన్నా కూడా ముఖంపై చిరునవ్వును మాత్రం చెదరనీయలేదు. ఆ నవ్వులోనే తను ఎంత ధైర్యంగా ముందుకెళుతున్నది చూపించింది. క్యాన్సర్ ను ఎదుర్కొంటున్న ఈ హీరోయిన్ మనోదైర్యాన్ని సోషల్ మీడియాలో అందరూ పొగుడుతున్నారు.


Full View
Tags:    

Similar News