తమ్ముడికి ప్రొటెక్షన్ వాడమని చెబ్తుందట

Update: 2016-10-13 09:32 GMT
అక్కా తమ్మడు రిలేషన్ భలే గుంటుంది. సినిమాల్లో చూపించినంత ఓవర్ సెంటిమెంట్ కాకపోయినా.. అక్కా తమ్ముళ్ల రిలేషన్ సూపర్ అనాల్సిందే. అందులోనూ తమ్ముడు మరీ చిన్నాడైతే.. అమ్మ రేంజ్ లో సాకడం అక్క డ్యూటీగా చూస్తుంటాం. కానీ అక్క సోనమ్ కపూర్.. తమ్ముడు హర్షవర్ధన్ కపూర్ ల మధ్య రిలేషన్ వెరైటీగా ఉంది.

గాళ్ ప్రెండ్స్ విషయంలో సలహా ఇచ్చే అక్కలు చాలామందే ఉంటారు కానీ.. సెక్సువల్ లైఫ్ లో సలహాలు ఇచ్చే సిస్టర్ బహుశా సోనమ్ మాత్రమేనేమో. ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పింది సోనమ్. నేహ ధూపియా నిర్వహిస్తున్న నో ఫిల్టర్ నేహ కార్యక్రమానికి వచ్చిన సోనమ్... గాళ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ కి వెళ్లినపుడు ప్రొటెక్షన్ వాడమని చెబ్తుందట. అలాగే అమ్మాయిల విషయంలో వాడి టేస్ట్ మహా వరస్ట్ అనేస్తోంది. తనలాంటి అమ్మాయిలు గాళ్ ఫ్రెండ్స్ గా వద్దనుకోవడం వాడి మూర్ఖత్వం అనేస్తోంది కూడా.

హర్ష విషయంలో తాను అక్క రేహ కపూర్ చాలా కేర్ తీసుకుంటామని.. అమ్మాయిల ఎంపికలోనూ.. ఆ విషయాల్లోనూ తామిద్దరం సలహా ఇస్తామని సోనమ్ కపూర్ చెప్పడం సెన్సేషన్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News