కొడుకు పేరు పెట్టి పరిచయం చేసిన స్టార్‌ హీరోయిన్‌

Update: 2022-09-21 06:44 GMT
బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సోనమ్‌ కపూర్ మరియు ఆనంద్ అహుజా దంపతులు తమ కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్నారు.

వారి యొక్క సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా కొడుకుకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉన్నారు. తాజాగా కొడుకు ఫోటోను కూడా షేర్‌ చేసి ఈ దంపతులు అభిమానులతో ఆనందంను పంచుకున్నారు.

ఈ బాలీవుడ్‌ జంట తమ యొక్క కొడుకుకి వాయు అనే పేరును ఖరారు చేసినట్లుగా పేర్కొన్నారు. సోనమ్‌ కపూర్‌ వాయు పేరు యొక్క విశిష్టతను కూడా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసింది.

ప్రస్తుతం సోనమ్‌ కపూర్‌ మరియు ఆనంద్‌ అహుజా షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అంతే కాకుండా వాయి అనే పేరుకు వారు ఇచ్చిన వివరణ గురించి కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు.

మా జీవితంలోకి కొత్త అర్థాన్ని నింపిన బాబుకి హనుమంతుడు మరియు భీమ్‌ ల యొక్క స్ఫూర్తితో వాయు కపూర్ అహూజా అనే పేరును ఖరారు చేసినట్లుగా సోనమ్‌ కపూర్ మరియు ఆనంద్‌ అహుజా లు పేర్కొన్నారు. హిందూ ధర్మం లో వాయు అనేది అత్యంత కీలకమైన పదం గా వారు ఈ సందర్భంగా అభివర్ణించారు.

పంచభూతాల్లో ఒక్కటి అయిన వాయు అన్ని దేవతలకు కూడా కీలకం అన్నట్లుగా పేర్కొన్నారు. ఇంద్రుడు.. శివుడు.. కాళి దేవి ఇలా పలువురు దేవతలు కూడా వాయు దేవుడి సంబంధించిన వారే.. చెడును నాశనం చేయగలిగినంత సులభంగానే జీవులకు వాయు ప్రాణం అందిస్తుంది అంటూ సోనమ్‌ కపూర్ పోస్ట్‌ లో పేర్కొంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News