అక్కినేని నాగచైతన్య - చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సవ్యసాచి' రిలీజ్ సమీపిస్తుండడంతో ప్రమోషన్స్ కూడా నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సింగిల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి 'వై నాట్' అంటూ సాగే యూత్ ఫుల్ పాట.. రెండోది 'ఒక్కరంటే ఒక్కరు' అనే సోల్ ఫుల్ మెలోడీ. తాజాగా ఈ సినిమా నుండి మూడో సింగిల్ ను రిలీజ్ చేశారు. 'సాంగ్ ఆఫ్ సవ్యసాచి' అనే ఈ పాటే టైటిల్ సాంగ్.
హీరో పాత్రను మరో లెవెల్ తీసుకెళ్ళే సమయంలో వచ్చే పాటలా ఉంది ఈ సాంగ్ ఆఫ్ సవ్యసాచి. "చండ మార్తాండ భామండలీ మండితా ఖండలా దండ ధారాహతి కాద్రవే యాగ్ర జోదగ్ర దంష్ట్రాకరాళాగ్ని భీభత్స కీలార్భటి".. చూశారుగా ఇలాంటి క్లిష్టమైన.. సాధారణ జనాలు సరిగ్గా పలకడానికి కష్టమైన పదాలతో శివశక్తి దత్తా - రామకృష్ణ కోడూరి ఈ పాటకు సాహిత్యం అందించారు. కానీ ఆ పదాలు పలుకుతుంటేనే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. అలాంటి సాహిత్యానికి కీరవాణి ఒక భీభత్సమైన ఒక బాణీ అందించడంతో ఇదో పవర్ఫుల్ సాంగ్ గా మారిపోయింది. ఈ పాటను పదిహేను మంది సింగర్స్ పాడడం విశేషం.
ఈ పాట సాహిత్యం.. ఆ పవర్ఫుల్ నేపథ్యం చూస్తుంటే 'సాహోరే బాహుబలి' గుర్తుకురాక మానదు. ఏదేమైనా కీరవాణి మూడో సింగిల్ తో కూడా మ్యూజిక్ లవర్స్ ను మెప్పించినట్టే. మీరు కూడా ఒకసారి పాటపై లుక్కేయండి.. ఒక గ్లాసు వాటర్ లేదా బాటిల్ వాటర్ దగ్గర పెట్టుకోండి. పాటను విన్న తర్వాత కాస్త బీపీ పెరగొచ్చు..!
Full View