పశుపతికి క్రిష్‌ బ్రేకివ్వాల్సిందే

Update: 2018-04-14 09:21 GMT
2008లో అరుంధతి సినిమాలో బొమ్మాళి అంటూ 'నంది' అవార్డ్ రేంజ్ పెర్ఫామెన్స్ తో అరిపించేశాడు సోనూ సూద్. ఆ సినిమాలో పశుపతిగా చేసిన తరువాత.. టాలీవుడ్ లో విలన్స్ ఎలా ఉండాలో లుక్స్ మారిపోయాయ్. అప్పటివరకు కోటి శ్రీనివాసరావు.. తనికెళ్ళ.. ఆహుతి.. ఇలా అందరూ విలన్సే. కాని అక్కడ నుండి మాత్రం.. తెల్లగా ఉండి సిక్స్ బాడీ ఉన్న మోడల్స్ ను విలన్స్ గా పెట్టుకోవడం టాలీవుడ్ అలవాటు చేసుకుంది.

అయితే ఆ రేంజులో పేరు తెచ్చుకున్న సోనూకు టాలీవుడ్ లో ఇప్పుడు జోరు లేకుండా పోయింది. 2014లో మహేష్‌ బాబుతో చేసిన ఆగడు సినిమా తప్పిస్తే.. అసలు సోనూ కెరియర్ లో పెద్ద సినిమాలు ఇక పడట్లేదు. ఆ మద్యన అభినేత్రి అంటూ వచ్చాడు కాని క్లిక్కవ్వేలదు. ఇప్పుడు హిందీలో క్రిష్ డైరక్షన్లో రూపొందుతున్న మణికర్ణికలో ఓ కీలక పాత్ర కోసం సోను సూద్ ను తీసుకున్నాడు క్రిష్‌. ఈ మూవీలో సదాశివ్ పాత్రలో కనిపించబోతున్నాడు అరుంధతి విలన్. ఇలా రియల్ లైఫ్ క్యారెక్టర్లను చేయడం చాలా క్లిష్టమైన విషయంగా అభిప్రాయపడ్డ సోను సూద్.. అవి ఛాలెంజింగ్ గా ఉంటాయని అంటున్నాడు. ఈ చిత్రంలో సోను సూద్ క్యారెక్టర్ కు సంబంధించి షూటింగ్ నుంచి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. మరాఠా వారియర్ గా సోను సూద్ లుక్ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. ఈ సినిమాతోనైనా మనోడు బ్రేక్ తెచ్చుకుంటాడా?

ఆ మధ్యన బాలీవుడ్లో ఓ రెండు మూడు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన సోనూ సూద్.. 44 ఏళ్ళ వయస్సులో హీరోగా నిలదొక్కుకుందాం అని ప్రయత్నించాడు. కాకపోతే అన్నీ బెడసికొట్టాయి. ఇప్పుడు క్రిష్‌ తో చేస్తున్న సినిమా కాబట్టి.. అటు హిందీలోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా మరోసారి ఇంప్రెస్ చేస్తాడని ఆశిద్దాం.
Tags:    

Similar News