సినీ ఇండస్ట్రీలో అతనో విలన్.. కానీ రియల్ లైఫ్ లో కాదు. ఆల్రెడీ మనసు మానవత్వం ఉన్న మనిషిగా గుర్తింపు పొందాడు. మాములుగా కష్టాలలో ఉన్న జనాలకు హెల్ప్ చేసేవారు ఎక్కువగా సినిమా క్యారెక్టర్స్ లోనే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా మంచి, మానవత్వం తెలిసిన.. ఎదుటివారికి సాయం చేయాలనే తపన ఉన్న వ్యక్తి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడే కావడం విశేషం. ఆ వ్యక్తి ఎవరో ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సోనూసూద్.. ఈ పేరు ఇప్పుడు దేశంలో ఓ వైబ్రేషన్ లా మారింది. ఇంతవరకు సోనూసూద్ ఒక సినిమాల మనిషిగానే తెలుసు.
కానీ ప్రతి మనిషికి తనని తను నిరూపించుకోవడానికి ఓ టైం వస్తుందని అంటారు కదా! అలాగే కరోనా మహమ్మారి అనేది ఒకటి వచ్చి వలస కార్మికులను.. ఎక్కడి నుండో వచ్చి ఒకే చోట ఇరుక్కుపోయిన వారిని ఇబ్బంది పెడుతుంటే.. తన టైం వచ్చిందని భావించి వాళ్లను సొంతూరుకు పంపి నిజమైన మనిషిగా నిలబడ్డాడు. కార్మికులకు సేవచేయడానికే నన్ను దేవుడు పంపించాడేమో అని సోనూసూద్ స్వయంగా చెప్పాడు. అప్పటినుండి సోనును విలన్ గా చూడటం మానేశారు ప్రేక్షకులు. కరోనా వైరస్ భాదితులకి చికిత్స అందించడానికి వైద్య సిబ్బందికి విశ్రాంతి తీసుకునేందుకు, అలాగే హెల్త్ వర్కర్స్.. ఉచితంగా వలస కార్మికులకు ప్రయాణ సౌకర్యం కల్పించాడు. పెద్ద చిన్న ముసలి ముతక అనే తేడా లేకుండా అందరికి సహాయం చేస్తూనే ఉన్నాడు.
తాజాగా సోషల్ మీడియాలో సోనూసూద్ పేరు మారుమోగి పోతుంది. ఎందుకో తెలుసా.. పద్మవిభూషణ్ సోనుకు ఇవ్వాలంటూ ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సోనూసూద్ కరోనా టైంలో చేసిన సేవలను గుర్తించాలని సహాయం పొందిన వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా అదే లిస్టులో ఉన్నాడు. ఇదివరకే సోనుకు పద్మవిభూషణ్ ఇవ్వాలని కోరిన బ్రహ్మాజీ.. తాజాగా ప్రభుత్వం పద్మవిభూషణ్ కోసం పేర్లు రిఫర్ చేయాలనీ ప్రకటించగానే సోనూసూద్ పేరు రిఫర్ చేసాడు. "పద్మవిభూషణ్ ఫర్ సోనూసూద్'" అనే హ్యాష్ ట్యాగ్ తో రీట్వీట్ చేయాలనీ కోరాడు. ఆ విషయం సోనుకు చేరడంతో స్పందించి.. "135 కోట్లమంది ఇండియన్స్ ప్రేమభిమానాలే నాకు పెద్ద అవార్డు. ఆల్రెడీ అంతటి ప్రేమను పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు“ అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.