కంగన రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ`. క్రిష్ మొదలు పెట్టి చివరలో వదిలేసిన ఈ చిత్రాన్ని కంగనా రనౌత్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్న సోనూసూద్ ఇప్పుడు ఫీలవుతున్నాడు. అనాలోచితంగా ఆలోచించి చారిత్రాత్మక చిత్రాన్ని వదులుకున్నానని బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కారణంగా ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో దర్శకత్వ బాధ్యతల్ని కంగన తనమీద వేసుకుంది. ఇది నచ్చని సోనూసూద్ సినిమా నుంచి తప్పుకుని చిత్ర యూనిట్ కు షాకిచ్చాడు.
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదురొడ్డి విజయవంతంగా క్రిష్ అసంపూర్తిగా వదిలేసిన చిత్రాన్ని కంగన పూర్తి చేసింది. ఈ సినిమా ఈ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా తన తొందరపాటుకు సోనూసూద్ ఫీలవుతూ సినిమాపై - చిత్ర బృందంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాని వదులుకున్నందుకు ఆ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే వుంటుంది... అని అన్నారు.
ఈ చిత్రం కోసం యూనిట్ అంతా చాలా శ్రమించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. ఈ సినిమా నుంచి నేను తప్పుకోవడానికి అసలు కారణం రోహిత్ షెట్టి `సింబా`. ఆ సినిమా కోసం డేట్స్ సమస్య తలెత్తడం వల్లే `మణికర్ణిక` నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని - ఆ సినిమా కోసం `మణికర్ణిక` లాంటి చారిత్రక చిత్రాన్ని వదులుకున్నందుకు బాధపడుతున్నానని సోనూసూద్ ఓ బాలీవుడ్ మీడియాకు వివరించడం ఆసక్తికరంగా మారింది.