ఈమద్య కాలంలో సోనూ సూద్ చేస్తున్న సాయాలు మరెవ్వరు చేయడం లేదేమో అనిపిస్తుంది. అంతగా ఆయన చేతికి వెముక లేదా అన్నట్లుగా సాయంను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆయన పేద వలస కార్మికులకు చేసిన సాయం మొదలుకుని ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఈమద్య కాలంలో విద్యార్థులపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ సాయంను అందించేందుకు ఆయన ఎప్పుడు ముందు ఉంటున్నాడు. ఐఏఎస్.. ఐపీఎస్ కు వెళ్లాలి అనుకునే వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాడు.
ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అయిజ గ్రామానికి చెందిన దేవికారెడ్డి అనే విద్యార్థిని కన్వినర్ కోటా కింద గురునానక్ కాలేజ్ లో ఫార్మా డీ సీటు దక్కించుకుంది. మొదటి సంవత్సరం కష్టపడి కుటుంబ సభ్యలు ఆమె ఫీజు చెల్లించారు. కాని ఈ ఏడాది ఆమె విద్యకు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోవడంతో ఆమె చదువుకు దూరం అవ్వాలనుకుంది. కాని అనూహ్యంగా ఆమె విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న సోనూసూద్ కాలేజ్ ఫీజ్ ను చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. ఆయన అభిమానులను పంపించి కాలేజ్ లో ఫీజు చెల్లించాడు. 49500 చెక్కును యూనివర్శిటీ పేరుతో సోనూసూద్ పంపించాడు. దాంతో దేవిక రెడ్డి చదువు కొనసాగబోతుంది.