సౌత్ లోనే కాదు యావత్ ప్రపంచంలోనే వివిధ దేశాల్లో అభిమానులు ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ సౌందర్య ద్వితీయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న చెన్నై కోడంబాక్కం ప్రాంతంలోని రాఘవేంద్ర ఫంక్షన్ లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు అతిరధ మహారధులు ఎందరో వచ్చారు. కొత్త పెళ్లి కొడుకు విశాఖన్ పక్కన సౌందర్య తగ్గ జోడి అనిపించుకుంది. సాధారణంగా చిన్నా పెద్ద తేడా లేకుండా ఏ పెళ్లి అయినా సరే వచ్చిన అతిధులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం.
అలాంటిది భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళలో ముందువరసలో పేరున్న రజని ఇంట పెళ్లి అంటే గెస్టులు ఏవేవో ఊహించుకోవడం సహజం. తమిళ సంప్రదాయాల్లో భాగం ఓ బ్యాగులో ఒలవని టెంకాయ వక్కపొడి అరటి పళ్ళు సుపారీ లాంటివి పెట్టి ఇవ్వడం కామన్. అయితే తలైవా ఆలోచన వేరుగా ఉంది. ఇక్కడ కూడా సమాజ శ్రేయస్సు అనే యాంగిల్ లో ఆలోచించాడు.
వచ్చిన అతిధులు అందరికి తలో బ్యాగ్ ఇచ్చారు.అందులో ఏముందా అని చూస్తే వివిధ రకాలైన అరుదైన జాతులకు చెందిన చెట్లకు సంబంధించిన విత్తనాలు ప్రత్యేకంగా ప్యాక్ చేయించి ఇచ్చారు . కవర్ పైన అది ఏ రకమో వివరిస్తూ మీరు నాటినా పారేసినా ఇది చెట్టుగా మారి భవిష్యత్ తరాలకు నీడనిస్తుంది అనే మెసేజ్ కూడా పొందుపరిచారు. ముందు షాక్ తిన్న ఆహుతులు అందులో ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దాన్ని భద్రంగా నాటేందుకు ఇళ్ళకు తీసుకెళ్ళిపోయారు. అసలే రజని ఇచ్చిన మొక్కలాయే. పీకేస్తే ఆయనేమి కొట్టడు కాని అలా పెంచితే ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది కదా. శీ దయా ఫౌండేషన్ ఈ కార్యక్రమంలో రజని కుటుంబంతో పాలు పంచుకుంది.