రజినీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు..!

Update: 2018-11-13 11:26 GMT
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఇంట వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి వేడుకకు రంగం సిద్దం అవుతోంది. రజినీకాంత్‌ కూతురు సౌందర్య రజినీకాంత్‌ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. మొదటి భర్త నుండి గత సంవత్సరం విడాకులు తీసుకున్న ఈమె తాజాగా రెండవ పెళ్లికి నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సౌందర్య - విషాగన్‌ వనంగమూడి ల వివాహ నిశ్చితార్ధం జరిగిందట.

సౌందర్య 2010వ సంవత్సరంలో అశ్వినీ కుమార్‌ తో వివాహం జరిగింది. వీరిద్దరి మద్య కొన్నాళ్లకే విభేదాలు తలెత్తాయి. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయినా కూడా కలిసి ఉండటం అసాధ్యం అంటూ తేలడంతో గత సంవత్సరం విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సౌందర్య మళ్లీ పెళ్లికి సిద్దం అయ్యింది. సినిమాలతో పాటు, వ్యాపారాలతో బిజీగా ఉన్న సౌందర్య వ్యాపార వేత్త విషాగన్‌ ను వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకోబోతుంది.

విషాగన్‌ ప్రముఖ పార్మాసూటికల్‌ కంపెనీ అధినేత. తమిళనాడు ప్రముఖ వ్యాపారవేత్తలో ఆయన ఒకరు. ఆయన గతంలో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారట. కాని అప్పట్లో ఆయనకు పెద్దగా గుర్తింపు లేక పోవడంతో నటించిన సినిమాలు ఆడలేదు. రెండు మూడు సినిమాల్లో హీరోలుగా నటించిన విషాగన్‌ - కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటించాడు. కాని నటుడిగా మాత్రం విషాగన్‌ కు గుర్తింపు రాలేదు. సౌందర్యను వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ ఈయన హీరోగా ప్రయత్నిస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News