సూపర్ స్టార్ రజనికాంత్ రెండో కూతురు సౌందర్య త్వరలో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. మొదటి భర్తనుండి రెండేళ్ళ క్రితం విడాకులు తీసుకున్న సౌందర్య ఇప్పుడు మరోసారి వివాహజీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. సౌందర్యను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కోలీవుడ్ నటుడైన విశాగన్ వనంగమూడి.
విశాగన్ - సౌందర్యల వివాహం ఫిబ్రవరి 11 న జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే సౌందర్య తన వివాహానికి ముందుగా దైవానుగ్రహం కోసం గుళ్ళూ గోపురాలు తిరుగుతోందట. సౌందర్య ప్రొఫెషనల్ గా.. పర్సనల్ గా తన జీవితంలో ఫెయిల్యూర్లను ఎదుర్కొంది. డైరెక్టర్ గా 'కొచ్చాడయాన్'.. 'VIP2' సినిమాలు తీస్తే అవి రెండూ ఫ్లాప్ అయ్యాయి. మొదటి వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అందుకే ఈసారి తన వివాహానికిముందే దైవబలం కోసం పూజలు పునస్కారాలతో బిజీగా ఉందట రజనీ కూతురు.
పైనున్న ఫోటో ఇలా సౌందర్య ఒక ఆలయ సందర్శనార్థం వెళ్ళినప్పుడు తీసిందే. ఆలివ్ గ్రీన్ కలర్ చుడిదార్ లో చూడముచ్చటగా ఉంది కదా అమ్మాయి..? మరి ఈసారైనా ఆమెకు దైవానుగ్రహం లభించాలని.. అంతా మంచే జరగాలని కోరుకుందాం.