సౌత్ నెంబర్ 1 సూర్య..!

Update: 2023-01-16 15:30 GMT
పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న సౌత్ సినీ పరిశ్రమలో టాప్ సెలబ్రిటీ ఎవరు అని అడిగితే చెప్పడం కష్టం ఓ పక్క తెలుగు హీరోలు నేషనల్ లెవల్లో దుమ్ముదులిపేస్తుండగా తమిళ, కన్నడ, మళయాళ హీరోలు కూడా వారి సినిమాలతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. లేటెస్ట్ గా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (IIHB) ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో సౌత్ ఇండియా టాప్ సెలబ్రిటీగా తమిళ నటుడు సూర్య నిలిచాడు. కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్య లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నారు.

ఇక ఇప్పుడు IIHB సర్వేలో కూడా టాప్ 1 గా నిలిచారు. విక్రం సినిమాలో కమల్ అదరగొట్టగా చివరి ఐదు నిమిషాలు రోలెక్స్ పాత్రలో సూర్య చించేశాడు. లోకేష్ డిజైన్ చేసిన పాత్రకు పర్ఫెక్షన్ తెచ్చాడు సూర్య. అందుకే అతనికి ఐ.ఐ.హెచ్.బి సర్వే లో టాప్ ప్లేస్ దక్కింది. ఇక భాషల ప్రకారం చూస్తే తమిళంలో సూర్యనే టాప్ కాగా తెలుగులో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

పుష్పరాజ్ పాత్రతో అల్లు అర్జున్ ఊర మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పుష్ప మాయలో ఊగిపోయారు ఆడియన్స్. తెలుగులో అల్లు అర్జున్ తర్వాత సెకండ్ ప్లేస్ లో విజయ్ దెవరకొండ ఉన్నాడు. తమిళ్ లో సూర్య తర్వాత విజయ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐ.ఐ.హెచ్.బి సర్వేలో 5246 మంది పాల్గొన్నారు. సౌత్ నుంచి 18 మంది సెలబ్రిటీస్ ఈ లిస్ట్ లో ఉన్నారు.

ఆరుగురు హీరోలు తెలుగు నుంచి, తమిళ్ నుంచి మరో ఆరుగురు హీరోలు కన్నడ నుంచి ఇద్దరు మళయాళం నుంచి నలుగురు సెలబ్రిటీస్ ఈ లిస్ట్ లో ఉన్నారు. 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సర్వే జరిగింది. IIHB ప్రతి ఏడాది సర్వే చేస్తుంది. కానీ సౌత్ కోసం స్పెషల్ గా సర్వే నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి. మళయాళంలో దుల్కర్, ఫహద్ ఫాజిల్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. కన్నడ నుంచి సుదీప్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. అయితే సౌత్ ఇండియాలో మాత్రం హీరో సూర్య టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News