సినిమా సంగీతం వినే అలవాటు ఉన్నా లేకపోయినా తెలుగు నేలపై గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం పేరు తెలియని వారు ఉండరు. బాషా బేధం లేకుండా వేల పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్త గాయకుల తాకిడిలో వయసు రిత్యా ఎక్కువ పాడలేకపోతున్న బాలు టీవీ కార్యక్రమాలు స్టేజి షోల ద్వారా కనుమరుగవుతున్న మధురమైన సంగీతాన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అలాంటి బాలుకు హీరొయిన్లు ఇప్పటి సినిమాలు రాజకీయాల మీద తీవ్ర అసహనం కలుగుతోంది. దాన్ని ఇటీవలే తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో బయట పెట్టేసుకున్నారు. పాశ్చాత్య సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఏమైనా అంటే ఇంగ్లీష్ సినిమాల్లో చూపించేవే కదా అంటూ సమర్ధించుకుంటున్నారని విరుచుకుపడ్డారు. అయితే వాళ్ళు బాత్ రూమ్ లో జరిగేవి చూపిస్తే అవి కూడా తెలుగు సినిమాల్లో చూపిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. అంతే కాదు వర్తమాన హీరొయిన్ల మీద కూడా ఘాటు విమర్శలు గుప్పించారు.
పొట్టి దుస్తులు వేసుకుంటేనే నిర్మాతలు అవకాశాలు ఇస్తారనే భ్రమలో ఏకంగా స్టేజిల మీద కూడా కురచ దుస్తులతో వస్తున్నారని ఇంత కంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదని వాపోయారు. పనిలో పనిగా రాజకీయాల మీద కూడా ఘాటు కౌంటర్లు గుప్పించారు బాలసుబ్రమణ్యం మాటల్లో ఆవేదన నిజం ఉన్నప్పటికీ మారిపోయిన ట్రెండ్ లో వీటిని ఎవరూ వినే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇదంతా అరణ్య ఘోషే అవుతుంది. అయినా పెద్దల మాట చద్ది మూట అన్నారు కాబట్టి ఇది విని ఎవరిలో అయినా కొంత మార్పు వచ్చినా సార్థకమే అనే ఉద్దేశంతో చెప్పారేమో. ఈ మధ్య మన ఆల్బంస్ లో వినపడటం మానేసిన బాలు స్వరం యాత్ర పాట రూపంలో అందరిని మెప్పించి సక్సెస్ అయ్యింది