గాన గంధ‌ర్వుడిపై షాకిచ్చే సంగ‌తి తెలిసింది

Update: 2020-09-26 17:30 GMT
తెలుగు పాటంటే ముందుగా వినిపించే పేరు ఘంట‌సాల‌. అయితే అది నిజం కాద‌ని నిరూపించారు బాలు. `మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు..` అంటూ ఎస్పీ కోదండ‌పాణి సంగీత నిర్దేశ‌క‌త్వంలో బాలు పాడిన పాట ప్ర‌తీ ఒక్క‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంద‌ట‌. భ‌లే పాడుతున్నాడే అని బాలుని పొగ‌డ‌ని వారంటూ లేర‌ట‌. అయితే బాలుకు తొలి అవ‌కాశాన్నిచ్చిన ఎస్పీ కోదండ‌పాణి మాత్రం బ‌ల‌సుబ్ర‌హ్మ‌ణ్యం 40 ఏళ్లు పాట‌లు పాడ‌తాడ‌ని గాన గంధ‌ర్వుడిగా పేరు ప్ర‌ఖ్యాతులు పొందుతార‌ని అప్పుడే గ్ర‌హించార‌ట‌.

ఓ పాట‌ల పోటీలో బాలు ప్ర‌తిభ‌కు మెచ్చిన కోదండ‌పాణి సినిమాల్లో పాడ‌తావా? అని అడిగార‌ట‌. ప‌ద్ధ‌తిగా వుంటే క‌నీసం 40 ఏళ్లు పాడ‌గ‌ల‌వ‌ని అప్పుడే బాలుతో చెప్పార‌ట‌. ఆయ‌న మాట‌లు అక్ష‌ర స‌త్యాలుగా మారాయి. ఆయ‌న ఊహించిన‌ట్టే బాలు 40 ఏళ్ల‌కు మించి పాట‌లు పాడారు. ఎస్పీ కోదండ‌పాణి చెప్పిన‌ట్టుగానే బాలు త‌న గానామృతంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. వారి హృద‌య మందిరాల్లో గాన గంధ‌ర్వుడిగా కుడి క‌ట్టుకున్నారు.

బాలు ఏ వేదిక‌లో పాల్గొన్నా, ఇంటర్వ్యూల్లో గాని కోదండ‌పాణి పేరు వింటే ఆయ‌న క‌ళ్లు చెమ్మ‌గిల్లేవి. త‌న‌ని కోదండ‌పాణి ప‌రిచ‌యం చేసి వ‌దిలేయ‌లేద‌ని ఎంతో మంది సంగీత ద‌ర్శ‌కుల‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వ‌ద్ద‌కు స్వ‌యంగా తీసుకెళ్లి త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌మ‌ని అడిగార‌ని బాలు గుర్తు చేసుకున్నారు‌. ఆ కృత‌జ్ఞ‌త‌తోనే బాలు ఆయ‌న పేరుని త‌న రికార్డింగ్ స్టూడియోకి పెట్టుకున్నార‌ట‌. నాకు .ఈవితాన్నిచ్చిన ఆయ‌న కుటుంబానికి త‌న చ‌ర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా త‌క్కువే అని బాలు ఓ సంద‌ర్భంలో చెప్పారంటే ఎస్పీ కోదండ‌పాణి అంటే ఆయ‌కు ఎంత కృత‌జ్ఞ‌త వుందో అర్థం చేసుకోవ‌చ్చు.
Tags:    

Similar News