బాలు గాత్రంలో ఎన్నో పాటలు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన శైలిలో పాటలు పాడిన ఆయన.. సినీ సంగీత అభిమానులను ఓలలాడించారు. కానీ , ఆ గొంతు నేడు మూగబోయింది. ఇక నా ఈ ప్రయాణం ముగిసింది అంటూ దివికేగిపోయారు.గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. 1966, డిసెంబర్ 15న ప్లేబ్యాక్ సింగర్‌గా తనన ప్రస్తానాన్ని ప్రారంభించిన బాలు.. వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలను అందుకుని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రాణాంతక కరోనా బారినపడిన కోలుకున్నప్పటికీ.. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో గురువారం సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్నాహ్యం తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు చరణ్ ప్రకటించారు.
ఎస్సీ బాలు మరణంతో ఆయన కుటుంబంతో పాటుగా యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక, మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్ లోని ఆయన నివాసానికి నేడు సాయంత్రం 4 గంటలకు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం వరకు ఇంటి వద్దనే బాలు భౌతికకాయం ఉంచుతారు. ఆ తర్వాత అభిమానులు సందర్శన కోసం శనివారం ఉదయం సత్యం థియేటర్ కు తీసుకెళ్లనున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పెద్ద భారీగా పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తర్వాత చెన్నై శివారు రెడ్ హిల్స్ లోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చేసిన అంతిమయాత్ర రథం సిద్ధంగా ఉంచారు.