స్పెష‌ల్ సాంగ్ ని రానా తో పాడిచాల‌ని

Update: 2021-09-25 10:30 GMT
స్పెష‌ల్ సాంగ్ ని రానా తో పాడిచాల‌ని
  • whatsapp icon
టాలీవుడ్ హంక్ రానా క‌థానాయ‌కుడిగా వేణు ఉడుగుల ద‌ర్శ‌కత్వంలో `విరాటప‌ర్వం` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రానా న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. సాయిధ పోరాటం నేప‌థ్యంలో సాగే చిత్రం కావ‌డంతో సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే  రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే మెజార్టీ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న విరాట‌ప‌ర్వం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతోంది. భీక‌ర అడ‌వుల్లో కీల‌క స‌న్నివేశాల  చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే వికారా బాద్ అడ‌వుల్లో కొంత భాగం షూటింగ్  చేసారు.

అవ‌స‌రంమేర న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లోనూ చిత్ర‌నీక‌రించారు.  తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్  అందింది. రానా ఈ సినిమాతో సింగ‌ర్ గాను ప‌రిచ‌యం అవుతున్నారు. సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ని నేరుగా రానా తో పాడిచాల‌ని డైరెక్ట‌ర్ డిసైడ్ అయ్యారు. ఆ పాట‌కు రానా గాత్రం స‌రిగ్గా స‌రిపోతుంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు కూడా భావించ‌డంతో ఆయ‌న్నే రంగంలోకి దించుతున్నారుట‌. వ‌చ్చే వారం ఈ పాట రికార్డింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ పాట‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంద‌ని స‌మాచారం. స్ర్కిప్ట్ లో భాగంగా సంద‌ర్భాను సారం సాగుతుందిట‌. దానికి అనుగుణంగా సురేష్ బొబ్బిలి ట్యూన్స్  కంపోజ్ చేసి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రానా స్వ‌యంగా గాత్రం వినిపించడం సినిమాకు ప్ల‌స్ గా మారుతుంద‌ని  అంటున్నారు. ఇందులో సాయి ప‌ల్ల‌వి  హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సుధాక‌ర్ చెరుకూరి- సురేష్ బాబు  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం రానా వ్య‌క్తిగ‌త ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప‌నులు పూర్తికాగానే పెండింగ్ షూటింగ్ లో పాల్గొంటార‌ని స‌మాచారం.
Tags:    

Similar News