బ్యాట్ తోనే కాదు.. బ్యూటీతోనూ స్మాష్ చేస్తోంది!

Update: 2021-04-17 04:34 GMT
‘మారియా ష‌ర‌పోవా..’ ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ స్థాయికి చేరిన ఈ ర‌ష్యా టెన్నిస్ దిగ్గ‌జం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. కేవ‌లం 17 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే వింబుల్డ‌న్ టైటిల్ సాధించిన ష‌ర‌పోవా.. ప్ర‌పంచం దృష్టిని త‌న‌వైపు తిప్పుకుంది.

2004లో తొలి వింబుల్డ‌న్ టైటిల్ నెగ్గిన త‌ర్వాత.. త‌న జైత్ర‌యాత్ర అప్ర‌తిహ‌తంగా కొన‌సాగించింది. 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి త‌న‌కు తిరుగే లేద‌ని చాటి చెప్పింది. దాదాపు ప‌దేళ్ల‌పాటు టెన్నిస్ ప్ర‌పంచాన్ని శాసించింది. అయితే.. ఎంత‌గా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది.

2016లో ఆస్ట్రేలియ‌న్  ఓపెన్ త‌ర్వాత నిర్వ‌హించిన డ్ర‌గ్స్ టెస్టులో విఫ‌లం కావ‌డంతో.. ఆమెపై అంత‌ర్జాతీయంగా 15 నెల‌ల నిషేధానికి గురైంది. ఆ త‌ర్వాత నిషేధం తొల‌గిపోయినా.. మునుప‌టి ఫామ్ ను అందిపుచ్చుకోవ‌డానికి ఇబ్బందులుప‌డింది. దీంతో.. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి 33 సంవ‌త్స‌రాలు. త్వ‌ర‌లో ఓ బ్రిటిష్ వ్యాపార‌వేత్త‌ను పెళ్లి కూడా చేసుకోబోతోంది. అయితే.. ఆట‌కు గుడ్ బై చెప్పిన త‌ర్వాత చాలా మంది క్రీడాకారులు ఎంచుకునే మార్గాన్ని ఫాలో అయ్యింది ష‌ర‌పోవా. లేటెస్ట్ బిజినెస్ ఉమ‌న్ గా మారిపోయింది. ఫ‌ర్నిచ‌ర్‌, చాక్లెట్స్ ఉత్ప‌త్తి చేసే రంగంలో వ్యాపారం మొద‌లు పెట్టింది. మొత్తంగా.. అటు రాకెట్ తో టెన్నిస్ కోర్టును ద‌డ‌ద‌డ‌లాడించిన ష‌ర‌పోవా.. ఇటు బిజినెస్ లోనూ త‌న టాలెంట్ తో స‌త్తా చాటాల‌ని చూస్తోంది.

అయితే.. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లోనూ ముందే ఉండే ఈ టెన్నిస్ బంతుల పాప‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మ‌ధ్య నిర్వ‌హించిన ఫొటో షూట్ వైర‌ల్ అయిపోవ‌డంతో.. వార్త‌ల్లో నిలిచిందీ బ్యూటీ.
Tags:    

Similar News