వందేళ్లు పైబడిన భారతీయ సినిమా చరిత్రలో టాలీవుడ్ మనుగడ 89 ఏళ్లు. ఈ సుదీర్ఘ జర్నీలో తెలుగు చిత్ర సీమ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఇప్పుడు పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ రేంజుకు ఎదిగింది. ఇన్నేళ్లలో ఒక్కో మెట్టు నిర్మాణం వెనక ఎందరో అతిరథమహారథుల కృషిని మరువలేం. గొప్ప క్లాసిక్ చిత్రాలతో పాటు బ్లాక్ బస్టర్లు.. ఇండస్ట్రీ హిట్లు పరిశ్రమలో ఉన్నాయి. ఇక ఈ జర్నీలో `హిట్ పెయిర్` కి ఉన్న ప్రత్యేకత గుర్తింపు వేరు.
క్లాసిక్ డేస్ మొదలు నేటి తరం వరకూ పరిశ్రమలో ఎందరు హిట్ పెయిర్స్ ఉన్నారు? అన్నది ఆరా తీస్తే టాప్ 20 పెయిర్స్ పేర్లు కనిపించాయి. ఎన్టీఆర్ - సావిత్రి.. ఏఎన్నార్ - సావిత్రి.. ఏఎన్నార్ - వాణిశ్రీ..కృష్ణ - విజయ నిర్మల ..శోభన్ బాబు - శారద ..కృష్ణరాజు- జయసుధ .. చిరంజీవి - రాధ..చిరంజీవి- విజయశాంతి..చిరంజీవి- రాధిక..చిరంజీవి- కాజల్.. బాలకృష్ణ- విజయశాంతి..బాలకృష్ణ- రాధ.. బాలకృష్ణ - రోజా.. బాలకృష్ణ- సిమ్రన్..బాలకృష్ణ- నయనతార.. నాగార్జున - రజనీ..నాగార్జున- నగ్మ..నాగార్జున- రమ్యకృష్ణ.. నాగార్జున - సౌందర్య.. నాగార్జున - శ్రియ.. వెంకటేష్ - సౌందర్య..వెంకటేష్ - మీనా.. రాజేంద్ర ప్రసాద్- రజనీ ..రాజేంద్ర ప్రసాద్- శోభన..సురేష్- యమున.. వినోద్ కుమార్ - యమున.. మహేష్ - ఇలియానా..మహేష్ - సమంత.. రామ్ చరణ్ - కాజల్..చరణ్ - తమన్నా.. ఎన్టీఆర్ - సమీరా రెడ్డి..ఎన్టీఆర్ - కాజల్.. ఇలా ఎన్నో చెప్పుకోదగ్గ హిట్ పెయిర్స్ ఉన్నాయి.
ఫలానా కాంబినేషన్ నటిస్తేనే సినిమాకి వెళతాం అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాలంతో పాటే మార్పు. నేటితరం ప్రతి సినిమాకి కొత్త కథానాయికల్ని వెతుకుతున్నారు. తెలుగు ఆడియెన్ కొత్తందాల్ని ఆశిస్తున్నారు. అందుకే మన దర్శకనిర్మాతలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సినిమా సినిమాకి కథానాయికల్ని రిపీట్ చేయకుండా కొత్త వాళ్లను ఎంపిక చేస్తున్నారు. అందువల్ల ఇటీవల హిట్ పెయిర్ అన్న కాన్సెప్ట్ కి అంత గా గుర్తింపు లేదు. హిట్ పెయిర్ పర్సంటేజీ బాగా తగ్గింది.